Moviesసందిగ్ధంలో మెగా మేనళ్లుడి కెరియర్.. ఆరంభం అదిరింది కాని..!

సందిగ్ధంలో మెగా మేనళ్లుడి కెరియర్.. ఆరంభం అదిరింది కాని..!

మెగా మేనళ్లుడిగా కెరియర్ ప్రారంభించిన సాయి ధరం తేజ్ పిల్లా నువ్వు లేని జీవితం హిట్ అందుకుని ఆ తర్వాత వచ్చిన సుప్రీం హిట్ తో మెగా ఫ్యాన్స్ కు బాగా దగ్గరయ్యాడు. అయితే కెరియర్ లో రెండు మూడు హిట్లు కొట్టిన తేజ్ ఇక ఆ తర్వాత కష్టాలను ఎదుర్కుంటున్నాడు. తిక్క, విన్నర్ లానే గెస్ట్ రోల్ చేసిన నక్షత్రం కూడా ఫ్లాప్ అవడంతో సాయి ధరం తేజ్ కెరియర్ సందిగ్ధంలో పడింది.

ఇక ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న బివిఎస్ రవి జవాన్ రిపేర్ల మీద రిపేర్లు చేస్తున్నారట. దిల్ రాజు సహ నిర్మాతగా ఉన్న ఈ సినిమాను ఆయన లైట్ తీసుకున్నాడట. ఇక మరో పక్క వినాయక్ సినిమా చేస్తున్న తేజ్ ఆ సినిమా సెకండ్ హాఫ్ నచ్చలేదని మార్చమన్నాడట. అది కూడా ఆపేయాలని చూస్తున్నాడట. ఇక ఎటుకూడి ఈమధ్యనే కరుణాకరణ్ డైరక్షన్ లో మొదలుపెట్టిన సినిమా మీదే గురి పెట్టుకున్నాడట సాయి ధరం తేజ్.

కెరియర్ ఆరంభంలో అదరగొట్టిన ఈ సుప్రీం హీరో అర్గెంట్ గా హిట్ సినిమాలు తీయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి చూస్తుంటే తేజ్ కెరియర్ ఊహించని విధంగా మారిందని చెప్పొచ్చు. క్రేజ్ ఉంది కాబట్టి ఈ టైంలోనే సరైన నిర్ణయాలతో సినిమాలు తీస్తే బెటర్ లేదంటే మెగా మేనళ్లుడు వెనుక పడాల్సి వస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news