Gossipsరాశిఖన్నా ఐటెం సాంగ్స్?

రాశిఖన్నా ఐటెం సాంగ్స్?

ఐటెం సాంగ్స్…స్పెషల్ సాంగ్స్….పేరేదైనా కూడా మసాలా సినిమాలకు మరింత బూస్ట్ కావాలంటే ఆ సాంగ్ తప్పనిసరి. అయితే ఇంతకు ముందు అలాంటి ఐటెమ్ సాంగ్స్ కోసమే స్పెషల్‌గా కొంతమంది ఉండేవాళ్ళు. అయితే వాళ్ళు మరీ హీరోయిన్స్ అంత అందంగా ఉండేవాళ్ళు కాదు. అందుకే రాను రాను మన సినిమా డైరెక్టర్స్ ఆ ట్రెండ్‌కి మంగళం పాడేశారు. ఐటెం సాంగ్‌లో కూడా అందగత్తెలే ఉండాలని ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగానే తమన్నా, శృతీహాసన్, కాజల్ లాంటి టాప్ రేంజ్ హీరోయిన్స్‌తో ఐటెం సాంగ్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పుడు ఇదే కోవలో రాశిఖన్నా కూడా రెడీ అయింది. ఐటెం సాంగ్స్‌కి సై అనేసింది. రాశిఖన్నా అందాల పవర్ ఏంటో మన తెలుగు సినిమా డైరెక్టర్స్‌కి చాలా బాగా తెలుసు. యువ ప్రేక్షకుల హార్ట్స్‌ని మొదటి సినిమాతోనే షేక్ చేసిన రాశిఖన్నా ఇప్పుడిక ఐటెం సాంగ్స్‌తో ఏ రేంజ్‌లో దుమ్మురేపుతుందో చూడాలి మరి. రాశిఖన్నా స్కిన్ షోకి చాలా మంది స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక స్పెషల్ సాంగ్స్‌లో రాశిఖన్నా అందాల ప్రదర్శన చూసి అలాంటి వాళ్ళ మతులు పోవడం ఖాయం. ఐటెం సాంగ్స్‌కి నేను రెడీ అని రాశిఖన్నా చెప్పేసింది. ఇక మొదటి అవకాశం ఎవరు ఇస్తారో? రాశి అందాల ప్రదర్శన చేయబోయే మొదటి ఐటెం సాంగ్ ఏదో అతి త్వరలోనే తెలియాలి మరి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news