Gossipsదువ్వాడలో రామ్ చరణ్ డ్యాన్స్...ఎంత వరకూ ఛాన్స్?

దువ్వాడలో రామ్ చరణ్ డ్యాన్స్…ఎంత వరకూ ఛాన్స్?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇద్దరు బెస్ట్ డ్యాన్సర్స్ ఒకే సారి స్క్రీన్ పైన కనిపించే అవకాశాం ఉందా? దిల్ రాజు మాత్రం అలాంటి ప్రయత్నాల్లో ఉన్నాడు. అంతకుముందు సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టుతో మళ్ళీ మల్టీస్టారర్ ట్రెండ్ సెట్ చేసిన దిల్ రాజు ఆ తర్వాత ఎవడు సినిమాలో రామ్ చరణ్, అల్లు అర్జున్‌లు కలిసి నటించేలా చేయగలిగాడు. అప్పుడు రామ్ చరణ్ సినిమాకి అల్లు అర్జున్ సాయం చేశాడు. ఇప్పుడు అల్లు అర్జున్‌తో దిల్ రాజు చేస్తున్న దువ్వాడలో రామ్ చరణ్ చేత డ్యాన్స్ చేయించాలని ఫిక్స్ అయ్యాడట దిల్ రాజు.

దువ్వాడ నుంచి వచ్చి డిజెగా పాపులర్ అయిన క్యారెక్టర్‌లో అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు. ఆ సందర్భంలో వచ్చే ఒక సాంగ్‌లో సెలబ్రిటీస్ అందరూ కనిపిస్తారట. వాళ్ళలో రామ్ చరణ్ లాంటి హీరో ఉండి, అల్లు అర్జున్, రామ్ చరణ్‌లు ఒకే ఫ్రేం ఉండి డ్యాన్స్ చేశారంటే మాత్రం సినిమాకు సూపర్ బజ్ వస్తుందని దిల్ రాజు, హరీష్ శంకర్‌లు ప్లాన్ చేస్తున్నారు. అసలే మెగా – అల్లు కుటుంబాల మధ్య లుకలుకలు ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భక్తుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్‌లో అల్లు వారి అబ్బాయి హీరోగా సినిమా బయటకు వచ్చిందంటే అన్ని రూమర్స్‌కి ఒకేసారి ఆన్సర్ చెప్పినట్టుగా ఉంటుందని భావిస్తున్నారట. మరి దిల్ రాజు ప్రపోజల్‌కి రామ్ చరణ్ ఒఫ్పుకుంటాడో లేదో చూడాలి మరి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news