Moviesజనతా గ్యారేజ్...ఎన్టీఆర్ బెస్ట్ ఎవర్ రికార్డ్!!

జనతా గ్యారేజ్…ఎన్టీఆర్ బెస్ట్ ఎవర్ రికార్డ్!!

అన్నీ రిపేర్లు చేయబడును అని ఏ ముహూర్తాన క్యాప్షన్ పెట్టారో కానీ జనతా గ్యారేజ్ సినిమా దెబ్బకు అన్ని రికార్డులూ రిపేర్ అయిపోతున్నాయి. ఎవ్వరూ ఊహించని విధంగా ఏకంగా టాప్ టూ పొజిషన్‌కే ఎసరు పెట్టేశాడు ఎన్టీఆర్. రిలీజ్ అయిన మార్నింగ్ షోకే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఓ సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించడం అంటే మాటలా. ఎన్టీఆర్ మార్కెట్ స్టామినా ఏంటో సింహాద్రి టైంలోనే చూసిన ఫిలిం ఇండస్ట్రీ ఇఫ్పుడు జనతా గ్యారేజ్ దెబ్బకు మరోసారి అలాంటి టేస్ట్‌ని రుచి చూసింది.

జనతా గ్యారేజ్ కలెక్షన్స్ విషయం పక్కన పెడితే ఆడియో సాంగ్స్ కూడా అదిరిపోయాయి. పక్కా లోకల్  సాంగ్ అయితే థియేటర్‌లో ఏ ఒక్కరినీ కూర్చోనివ్వలేదు. అలాగే ప్రణామం సాంగ్ అందరి నాలుకలపైన నాట్యమాడింది. ఇప్పుడు ఆ అభిమానమే ఆడియో సాంగ్స్ జ్యూక్ బాక్స్‌కి కూడా ఓ సరికొత్త రికార్డ్ తెచ్చిపెట్టింది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే నలభై లక్షల వ్యూస్‌కి రీచ్ అయిన ఒకే ఒక్క ఆడియో ఆల్బం జనతా గ్యారేజ్ మాత్రమే. దేవిశ్రీప్రసాద్‌కి అత్యంత ఆప్తుడైన ఎన్టీఆర్‌కి ఈ రికార్డ్ చాలా చాలా ఆనందాన్నిచ్చిందని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఆ సాంగ్సే పూనకాలు తెప్పించాయి ఇక ఈ రికార్డ్స్ అన్నీ కూడా బోనస్ అనుకుంటున్నారు..

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news