Newsచిన్న వయస్సులోనే తెలుగు హీరోల్లో రెండు అరుదైన రికార్డులు సాధించిన రామ్...

చిన్న వయస్సులోనే తెలుగు హీరోల్లో రెండు అరుదైన రికార్డులు సాధించిన రామ్ చరణ్

Ram Charan creates two rare records among the all star heroes in Tollywood with his dad megastar Chiranjeevi’s 150th project ‘Khaidi no 150’.

టాలీవుడ్‌లో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న స్టార్ హీరోలందరూ పోటాపోటీగా తమ సత్తా చాటుకుంటూ దూసుకెళుతున్నారు. ఒక్కొక్కొరు ఒక్కో రికార్డ్ బ్రేక్ చేస్తూ.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. అయితే.. రామ్ చరణ్ మాత్రం ఎవరికీ సాధ్యంకాని రెండు అరుదైన రికార్డులను తన ఖాతాలో జమ చేసుకున్నాడు.

వాటిలో మొదటిది.. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’ కోసం ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ అనే నిర్మాణ సంస్థని పెట్టిన చెర్రీ, అతి తక్కువ వయస్సులోనే ఆ రంగంలో అడుగుపెట్టిన హీరోగా ఘనత సాధించాడు. ఇక రెండోది.. తాను నిర్మించిన మొదటి సినిమాతోనే 100 కోట్ల గ్రాస్ అందుకున్న యంగ్ నిర్మాతగా రికార్డ్ సృష్టించాడు. ఈ విధంగా చరణ్ తన పేరిట రెండు రికార్డ్స్ నమోదు చేసుకున్నాడు.

కాగా.. చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు సన్నద్ధం అవుతున్నాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్లనుంది. మరోవైపు.. తన తండ్రి 151వ సినిమాని కూడా తన హోమ్ ప్రొడక్షన్‌లోనే తీస్తున్న చరణ్.. ఆ పనులు కూడా దగ్గరుండి చూసుకుంటున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news