Moviesకబాలి మొదలెట్టాడు... లెక్కెట్టుకోవడమే మిగిలింది!!

కబాలి మొదలెట్టాడు… లెక్కెట్టుకోవడమే మిగిలింది!!

రజనీకాంత్ మొదలెట్టాడు. సినిమా రిలీజ్ అవ్వకముందే తన స్టామినాతో కలెక్షన్స్ అక్షయ పాత్రను సృష్టించిపడేశాడు. ఇక సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచీ మొదలెట్టుకోవడమే..లెక్కెట్టుకోవడమే బేలన్స్. 170 లొకేషన్స్‌లో ప్రిమియర్ షో టికెట్ బుకింగ్స్‌తోనే ఒన్ మిలియన్ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు రజనీ. బాహుబలి సినిమా 70 లొకేషన్స్‌లో 700K సాధిస్తే రజనీ బాహుబలిని బ్రేక్ చేసి ఒన్ మిలియన్‌ని టచ్ చేశాడు.

కేవలం రెండు సినిమాల అనుభవమున్న పా. రంజిత్, ఏ క్రేజూ లేని రాధికా ఆప్టేలు హీరోయిన్‌గా నటిస్తూ ఉన్న కబాలి ఈ రేంజ్ రికార్డ్ కొట్టిందంటే ఇది కేవలం సూపర్ స్టార్ స్లామినానే. అందుకే ఇండియన్స్ అందరూ కూడా భాష, ప్రాంతాలతో సంబంధం లేకుడా రజనీ కోసం పడిచచ్చిపోతుంటారు. ఇఫ్పుడు ఓవర్సీస్ ఆడియన్స్ కూడా దీనికి అతీతం కాదని నిరూపితమైంది. కబాలి ఒన్ మిలియన్ రికార్డుని రజనీ ఫ్యాన్స్ అందరూ అమెరికాలోని చాలా ప్లేసెస్‌లో బాణా సంచా కాల్చి సెలబ్రేట్ చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news