Movies జనతా గ్యారేజ్ టీజర్ సునామీకి బ్రేకుల్లేవు...రికార్డులు బద్దలవుతూనే ఉన్నాయి

జనతా గ్యారేజ్ టీజర్ సునామీకి బ్రేకుల్లేవు…రికార్డులు బద్దలవుతూనే ఉన్నాయి

జనతా గ్యారేజ్ టీజర్ సునామీకి బ్రేకే లేనట్టుగా ఉంది. కొరటాల శివ, ఎన్టీఆర్‌లు యూట్యూబ్ రికార్డ్స్‌ని షేక్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఫాస్టెస్ట్ రికార్డ్సన్నీ తన పేర లిఖించుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు ఫైవ్ మిలియన్ రికార్డ్‌ని కూడా కొట్టేశాడు. అది కూడా జస్ట్ ఫిఫ్టీన్ డేస్‌లోనే జనతా గ్యారేజ్ ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. సినిమా పోస్ట్ పోన్ అయిందని ఎక్కడో కొంచెం డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ కూడా జనతా గ్యారేజ్ క్రియేట్ చేయబోయే రికార్డ్స్‌ని ఊహించుకుంటూ వెయిటింగ్‌ని కూడా మధురానుభూతులుగా మార్చుకుంటున్నారు.

ఇప్పుడు ఈ టీజర్ రికార్డ్స్ చూస్తుంటే వాళ్ళ ఆశలు గ్యారెంటీగా నెరవేరేలాగే ఉన్నాయి. సమంతా, నిత్యామేనన్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 2న రిలీజ్‌కి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకోసం సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ని కంపోజ్ చేస్తున్నాడు. ఆల్రెడీ టీజర్‌లోనే తన రీరికార్డింగ్ ఏ స్థాయిలో ఉండబోతుందో టచ్ ఇచ్చిన దేవి ఫుల్ సినిమాలో రాకింగ్ మ్యూజిక్ ఇస్తాడని వేరే చెప్పాలా? అసలే ఇప్పుడు మనవాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి జగిరి దోస్త్ కూడా.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news