Gossipsఎన్టీఆర్ అభిమానులకు మిల్కీ బ్యూటీ తమన్నాస్పెషల్ ట్రీట్!!

ఎన్టీఆర్ అభిమానులకు మిల్కీ బ్యూటీ తమన్నాస్పెషల్ ట్రీట్!!

ఎన్టీఆర్, కొరటాల శివలు మామూలుగా ప్లాన్ చేయలేదండోయ్. ఒక్క ప్రేక్షకుడు కూడా మిస్సవ్వకూడదు. థియేటర్‌కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడు కూడా థ్రిల్లయిపోవాలి. ఫుల్లుగా ఎంటర్టైన్ అవ్వాలి. క్లాస్, మాస్, ఊరమాస్…ఎ,బి,సి,డి…..ఎవ్వరికి కావాల్సిన ప్యాకేజీ వాళ్ళకు రెడీ చేస్తున్నారు.

జనతా గ్యారేజ్ నుంచి మరో బంపర్ న్యూస్ బయటకు వచ్చింది. ఎవ్వరి ఐటెం సాంగ్స్ అయితే మాస్ ఫ్యాన్స్ చేత విజిల్స్ కొట్టిస్తాయో……ఆ అందాల భరిణ తమన్నా చేత ఈ సినిమాలో చిందులేయించారు. ది బెస్ట్ డ్యాన్సర్ ఎన్టీఆర్‌తో కలిసి……..ఈ తరం హీరోయన్స్‌లో ది బెస్ట్ డ్యాన్సర్ అయిన తమన్నా కాలు కదిపితే ఏ రేంజ్‌లో స్క్రీన్ షేక్ అయి ఉంటుందో రిలీజ్ వరకూ ఊహించుకునే ఎంటర్టైన్ అవ్వొచ్చు. ఈ సాంగ్ గురించి శేఖర్ అయితే తనకు తెలిసిన వారందరికీ కూడా కథలు కథలుగా చెప్తున్నాడు. సింహాద్రిలో ‘చీకులమ్మ చిన్నది కావాలా’ తర్వాత ఆ రేంజ్‌కి మించిన స్థాయి ఐటెం సాంగ్ ఇదే అవుతుందని చెప్తున్నాడు. ఇక ఫుల్ మీల్స్ ప్యాకేజ్……ఎన్టీఆర్ ఇస్తున్న బెస్ట్ ఎవర్ ఎంటర్టైన్‌మెంట్‌ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం సెప్టెంబర్ రెండు వరకూ వెయిట్ చేయాలి మరి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news