Gossips`సాహో`కి యుఎస్‌లో దెబ్బ ప‌డ‌నుందా..!

`సాహో`కి యుఎస్‌లో దెబ్బ ప‌డ‌నుందా..!

బాహుబ‌లి సిరీస్ త‌ర్వాత యంగ్ రెబ‌ల్ స్టార్ ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ కాంబోలో భారీ బ‌డ్జెట్ సినిమాగా తెర‌కెక్కిస్తున్న చిత్రం `సాహో`. శ్రద్దా కపూర్ ప్ర‌భాస్ స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ‘సాహో’పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్లు, ట్రైల‌ర్లు, పాట‌లు అభిమానుల్లో హైప్ తీసుకువ‌చ్చాయి. బాహుబ‌లి వంటి పెద్ద సక్సెస్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ స‌సాహో`పై కూడా అదే స్టాయిలో క్రేజ్ ఉంది.

ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ‌ష్టు 30న విడుద‌ల కానుంది. రూ. 350 కోట్ల (స్వ‌యంగా ప్ర‌భాస్ చెప్పిన లెక్క‌ల‌ ప్ర‌కారం) భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రం యుఎస్ ఒక రోజు ముందే ప్రీమియ‌ర్ షో వేయాల‌ని డిసైడ్ అయింది. నిజానికి ప్ర‌భాస్‌కు బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌పంచ‌వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఇదే క్ర‌మంలో ఇప్పుడు తాజాగా రాబోతున్న సాహోకు మీద కూడా ఆ ఎఫెక్ట్ బాగానే ఉంది.

అయితే ప్ర‌స్తుత స‌మాచారం ప్ర‌కారం యుఎస్‌లో సాహోకు పెద్ద దెబ్బే ప‌డింద‌ని చెప్పాలి. నిజానికి ప్ర‌భాస్‌కు ఉన్న క్రేజ్‌తో ముందుగా ఒక రోజు డిస్ట్రిబ్యూట‌ర్లు ప్రీమియ‌ర్ షోను వేయాల‌నుకున్నాయి. దీంతో భారీ వ‌సూళ్లు రాబ‌ట్టుకోవ‌చ్చిన వాళ్లు ప్లాన్ చేసుకున్నారు. మ‌రియు ఆ `సాహో` రైట్స్ ఎవ‌రు ఊహించ‌ని విధంగా డిస్ట్రిబ్యూట‌ర్లు కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు కార‌ణం తెలియ‌క‌పోయినా ప్రీమియ‌ర్లు క్యాన్సిల్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ప్రీమియ‌ర్ల వ‌ల్ల సినిమా బాగున్నా యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ తెస్తార‌న్న భ‌య‌మే ఇందుకు కార‌ణ‌మ‌ట‌.

అయితే డిస్ట్రిబ్యూట‌ర్లు ప్రీమియ‌ర్ షోలు వేయ‌కుపోయినా వీరు పెట్టిన ఖ‌ర్చు కంటే అధిక లాభాలు బాగానే వ‌స్తాయి. కేవ‌లం ప్రీమియ‌ర్ షో క్యాన్స‌ల్ అవ్వ‌డంతో ప‌ది కోట్లు న‌ష్టం వ‌స్తుంది. ఇక తెలుగు రాష్ట్ర‌ల్లో సాహో క్రేజ్ చెప్పాల్సిన ప‌ని లేదు. కానీ యుఎస్‌లోమాత్రం నిజంగా సాహోకి పెద్ద గండి ప‌డింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news