GossipsR R R ఒక్క ఫైట్ ఖ‌ర్చు... ఇండియ‌న్ సినిమా...

R R R ఒక్క ఫైట్ ఖ‌ర్చు… ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీ రికార్డు..

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం టోట‌ల్‌గా ఇండియ‌న్ సినిమాలో ఉన్న అన్ని ఇండ‌స్ట్రీలు ఎంతో ఆస‌క్తిగా వెయిట్ చేస్తున్నాయి. బాహుబ‌లి సీరిస్ సినిమాల‌తో తెలుగు సినిమా ఖ్యాతిని ఇండియ‌న్ బోర్డ‌ర్ దాటించేసి వ‌ర‌ల్డ్ వైడ్‌గా తీసుకు వెళ్లిపోయారు. టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోస్ యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్‌ల కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎలా ఉంటుంది ? ఏ రేంజులో రికార్డులు బ‌ద్దులు కొడుతుంద‌ని ప్ర‌తి ఒక్క‌రు ఊహాలోకాల్లో విహ‌రిస్తున్నారు.

ఇక ఈ సినిమా గురించి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఓ వార్త ఇప్పుడు ఇండియ‌న్ సినిమా వ‌ర్గాల్లోనే హాట్ హాట్ ట్రెండింగ్ న్యూస్‌గా మారింది. ఈ సినిమాలో ఎన్టీఆర్,చరణ్ కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలలో న‌టిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ శివార్ల‌లో ఉన్న అల్యూమినియం కర్మాగారంలో వేసిన సెట్‌లో న‌డుస్తోంది. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొంటున్నారు.

ఈ సినిమా ఇంట‌ర్వెల్ సీన్ చాలా గ్రాండ్‌గా ఉండ‌బోతోంద‌ట‌. ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌లో వ‌చ్చే ఓ ఫైట్ సీన్ కోసం ఏకంగా రెండు నెల‌ల లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశార‌ట‌. ఈ యాక్ష‌న్ సీన్ కోసం 2 వేల మంది జూనియ‌ర్ ఆర్టిస్టులు వ‌ర్క్ చేస్తున్నారు. ఈ ఒక్క ఫైట్ కోస‌మే రాజ‌మౌళి ఏకంగా రూ.45 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించిన‌ట్టు స‌మాచారం.

ఒక్క ఫైట్ లేదా ఇంట‌ర్వెల్ బ్యాంగ్ కోసం ఏకంగా రూ.45 కోట్లు ఖ‌ర్చు చేయ‌డం ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో గ్రేట్ రికార్డుగా నిలిచిపోనుంది. రూ. 350 కోట్ల పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2020 జులై 30న విడుదల చేస్తున్నట్లు రాజమౌళి గతంలోనే ప్రకటించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news