Gossipsకాజల్ ను అలా వాడేందుకు సిద్ధమైన బన్ని..!

కాజల్ ను అలా వాడేందుకు సిద్ధమైన బన్ని..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రం కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ సెట్స్ మీద ఉంది. హారిక హాసిని క్రియేషన్స్ తో పాటుగా గీతా ఆర్ట్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం అవుతుంది. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం కాజల్ అగర్వాల్ ను సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. త్రివిక్రం సినిమాల్లో స్పెషల్ సాంగ్ ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పటికే సినిమాలో పూజా హెగ్దె తో పాటుగా నివేదా పేతురాజ్ నటిస్తుందని తెలుస్తుంది.

సీనియర్ హీరోయిన్ టబు కూడా సినిమాలో తల్లి పాత్రలో నటిస్తుంది. వీరందరు సరిపోరని కాజల్ తో పక్కా లోకల్ రేంజ్ లో ఓ సూపర్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. కచ్చితంగా ఈ సాంగ్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు. కాజల్ ను అలా వాడేందుకు దర్శక నిర్మాతలు సిద్ధమయ్యారు. రెమ్యునరేషన్ గట్టిగా ఇస్తే ఎలాంటి పాత్రకైనా రెడీ అని చెబుతున్న కాజల్ ఐటం సాంగ్ కు సై అంటుంది.

2020 సంక్రాంతి టార్గెట్ తో వస్తున్న ఈ సినిమాకు నాన్న నేను, అలకనంద టైటిల్స్ ప్రచారం లో ఉన్నాయి. అరవింద సమేత తరాత త్రివిక్రం చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత బన్ని, త్రివిక్రం కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news