RRRలో మరో సస్పెన్స్

Anushka Shetty Cameo In RRR

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమా కోసం యావత్ టాలీవుడ్ ఆడియెన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాకు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. ఈ సినిమా కోసం తెలుగు ఆడియెన్స్‌తో పాటు ఇతర భాషల ఆడియెన్స్ కూడా చాలా ఆశగా చూస్తున్నారు.

ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల పాత్రల్లో తారక్, చరణ్‌లు నటిస్తున్న విషయం చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. కాగా ఈ సినిమాలో మరో సస్పెన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన సైరా సినిమాలో అనుష్క స్పెషల్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో అనుష్కతో RRR సినిమాలోనూ కేమియో పాత్ర చేయించాలని చూస్తున్నారు రాజమౌళి. బాహుబలి తరువాత అనుష్క మరోసారి రాజమౌళి డైరెక్షన్‌లో నటించేందుకు ఎప్పటి నుండో చూస్తోంది.

ఒకవేళ ఇదే నిజమైతే రాజమౌళి ఇవ్వబోయే సస్పెన్స్ ఆడియెన్స్‌ను మరింత థ్రిల్‌కు గురిచేయడం ఖాయం. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.

Leave a comment