Moviesఒకే ఒక్క నిర్ణయంతో బడా హీరోలకు సైతం చెమటలు పట్టించేసిన ఉదయ్...

ఒకే ఒక్క నిర్ణయంతో బడా హీరోలకు సైతం చెమటలు పట్టించేసిన ఉదయ్ కిరణ్.. నిజమైన హీరోయిజం అంటే అదే..!

సినిమా ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ పేరుకు ఎలాంటి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అనే సంగతి మనం సపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. మరి ముఖ్యంగా ఉదయ్ కిరణ్ తనదైన స్టైల్ లో సినిమాలు చేసి అమ్మాయిల చేత వావ్ అని అనిపించుకున్నాడు . అప్పట్లో బుక్స్ పై అమ్మాయిలు ఉదయ్ కిరణ్ పేరుని ఏ రేంజ్ లో రాసుకొని ఆనందపడేవారో.. ఆ జనరేషన్ అమ్మాయిలకు బాగా గుర్తుండే ఉంటుంది.

ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ గా మారిన ఉదయ్ కిరణ్ అతి చిన్న వయసులోనే సూసైడ్ చేసుకొని మరణించారు . కాగా ఉదయ్ కిరణ్ కి సంబంధించిన ఏదో ఒక వార్త ఇప్పటికీ ట్రెండ్ అవుతుంది అంటే కారణం ఆయన పైన అభిమానులకు ఉన్న ప్రేమ అని చెప్పక తప్పదు. ఉదయ్ కిరణ్ నిర్మాతలని రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడట . ఇక అప్పట్లో ఉదయ్ కిరణ్ ..బడా బడా బ్యానర్స్ లో నటించే సినిమాలకు సైతం తక్కువ తీసుకునే వాడట .

ఒక పెద్ద డైరెక్టర్ నిర్మాత ఒక స్టోరీని బడా హీరోకి చెప్తే హై రెమ్యూనరేషన్ డిమాండ్ చేసేవారు. కానీ అదే కధను ఉదయ్ కిరణ్ దగ్గర చెప్తే మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను ..కధ ఇంపార్టెంట్ అంటూ చెప్పేవారు . అప్పట్లో ఉదయ్ కిరణ్ ఇలా మాట్లాడటం పై పలువురు స్టార్ హీరోలు కూడా గుర్రుగా ఉండేవారు. ఇంత మంచితనం పనికిరాదు అంటూ అవహేళన చేసేవారు . బహుశా ఆ మంచితనమే ఆయన కొంప ముంచేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news