Movies"నా భర్త బలవంతంగా ఆ డ్రగ్ ఎక్కించాడు".. యాంకర్ శ్యామల సెన్సేషనల్...

“నా భర్త బలవంతంగా ఆ డ్రగ్ ఎక్కించాడు”.. యాంకర్ శ్యామల సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

యాంకర్ శ్యామల.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . అందం విషయంలో హీరోయిన్స్ కి పోటీ ఇస్తుంది. తనదైన స్టైల్ లో బుల్లితెరను ఏలేస్తున్న యాంకర్ శ్యామల పలు ఈవెంట్స్ కి హోస్టుగా కూడా చేసింది . పలు సినిమాలలో సిస్టర్స్ – వదిన క్యారెక్టర్ లో నటించి మెప్పించింది. కాగా బుల్లితెరపై శ్యామల పలు సీరియల్స్ లో నటించి కూడా మెప్పించిన విషయం అందరికీ తెలిసిందే . ఎప్పటికప్పుడు యూట్యూబ్ ద్వారా తన లేటెస్ట్ అప్డేట్స్ అందజేసే శ్యామల ..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె పర్సనల్ ప్రైవేట్ లైఫ్ కి సంబంధించిన డీటెయిల్స్ ను బయటపెట్టింది . ఈ క్రమంలోనే భర్త పై సంచలన కామెంట్స్ చేసింది యాంకర్ శ్యామల . ఆమె మాట్లాడుతూ ..”అసలు నాకు యాంకర్ అవ్వాలన్న ఆసక్తి లేదు.. ఇష్టం కూడా లేదు.. కానీ నా భర్త పదేపదే చెప్పి మరి నాలోనే టాలెంట్ చూసి యాంకరింగ్ లోకి తోసేసాడు.. అలా కాస్తో కూస్తో యాంకరింగ్ వచ్చిన నాకు దానిపై ఇంకా ప్రేమ పెరిగిపోయింది”.

“ఆయన ఎక్కించిన ఆ డ్రగ్ వల్ల ఇప్పుడు యాంకరింగ్ చేయకపోతే అస్సలు నిద్ర పట్టని పరిస్థితి వచ్చింది. నా భర్త యాంకరింగ్ డ్రగ్ ఎక్కించాడు” అంటూ చెప్పుకు వచ్చింది. ఈ మాటలను యాంకర్ శ్యామల నార్మల్గా చెప్పుంటే పెద్ద వైరల్ అయ్యేది కాదు . కానీ డ్రగ్ అనే పదం వాడుతూ యాంకర్ శ్యామల ఈ కామెంట్స్ చేయడంతో సోషల్ మీడియాలో బాగా ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . అలాగే కొందరు తప్పు తప్పుగా ధంబ్ నెయిల్స్ పెట్టి మరి శ్యామల వీడియోస్ ను నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news