Moviesచిరంజీవి ఎందుకు అలాంటి పాత్రలల్లో నటించడు..? దాని వెనుక ఉన్న రీజన్...

చిరంజీవి ఎందుకు అలాంటి పాత్రలల్లో నటించడు..? దాని వెనుక ఉన్న రీజన్ ఇదే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి .. తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు . కొన్ని హిట్ అయ్యాయి కొన్ని ఫ్లాప్ అయ్యాయి . ఫ్లాప్ సినిమాలతో కూడా సూపర్ క్రేజ్ దక్కించుకున్న ఘనత చిరంజీవికి దక్కుతుంది . తాను నటించిన సినిమాలు ఫ్లాప్ అయినా సరే అడపాదడపా ఆయన నటనకు మంచి మార్కులే పడేలా చేసుకుంటాడు.

కాగా చిరంజీవి తన కెరీర్ లో డిఫరెంట్ డిఫరెంట్ పాత్రలు అన్ని పోషించాడు . కానీ ఎక్కడా కూడా ఏ సినిమాలో కూడా జబ్బు మనిషి ఉన్న పాత్రలో .. మంచానికి అతుక్కుపోయి ఉండే పాత్రలో కనిపించలేదు . దానికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరంజీవి ఎందుకు అలా చేశాడు..? చిరంజీవికి చాలామంది డైరెక్టర్ అలాంటి క్యారెక్టర్స్ ఉన్న పాత్రలను చూస్ చేశారట ..

కానీ మొదటి నుంచి చిరంజీవి అమ్మగారికి అలాంటి పాత్రలను చిరంజీవి చేయడం ఇష్టం లేదట . ఆ కారణంగానే తల్లి కోరిక ప్రకారం చిరంజీవి అలా చేయకుండా ఆగిపోయాడట. అన్ని పాత్రలలో అవలీలగా నటించి మెప్పించే చిరంజీవి .. తల్లి కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా ..? అంటూ తెలిసి అభిమానులు షాక్ అయిపోతున్నారు. అందుకే నువ్వు ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగావు అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవి .. వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష నటించబోతుంది . ఈ సినిమాలో చిరంజీవి డ్యుయెల్ షేడ్స్ లో కనిపించబోతున్నట్లు ఓ న్యూస్ కూడా బాగా వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news