Moviesవార్నీ..రాజమౌళి అందుకే ఆ హీరోయిన్ ని దూరం పెడుతున్నాడా? బయటపడ్డ సంచలన...

వార్నీ..రాజమౌళి అందుకే ఆ హీరోయిన్ ని దూరం పెడుతున్నాడా? బయటపడ్డ సంచలన నిజం..!!

సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ న్యూస్ బాగా బాగా ట్రెండ్ అవుతుంది. దర్శకధీరుడు గా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి స్థానాన్ని అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒకటి కాదు రెండు కాదు ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది . మరీ ముఖ్యంగా ఆయనలోని మరో యాంగిల్ ని కూడా బయటపెట్టింది .

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి ప్రెసెంట్ మహేష్ బాబు తో ఓ బిగ్ అడ్వెంచర్స్ మూవీ చేయబోతున్నాడు . ఇలాంటి క్రమంలోనే రాజమౌళికి సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి . రాజమౌళి సినిమాలలో హీరోయిన్స్ చాలా స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తారు . అయితే తన ఫేవరెట్ హీరోయిన్ తో మాత్రం ఇప్పటివరకు రాజమౌళి ఒక్క సినిమా కూడా చేయలేదు.

మగధీర సినిమాలో కాజల్ ..విక్రమార్కుడు సినిమాలో అనుష్క .. ఈగ సినిమాలో సమంత ను డిఫరెంట్ గా చూపించిన రాజమౌళికి హీరోయిన్ నిత్యామీనన్ అంటే చాలా చాలా ఇష్టమట. యాక్టింగ్ స్టైల్ బాగుంటుంది అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే ఆమెను ఎందుకు మీ సినిమాలో పెట్టుకోరు అన్న ప్రశ్నకు మాత్రం ఓపెన్ గా ఆన్సర్ ఇచ్చేశాడు. ” ఆమె హైట్ తక్కువ.. నేను వర్క్ చేసే హీరోలు అందరూ చాలా హైట్ గా ఉంటారు. అప్పుడు కాంబో మ్యాచ్ అవ్వదు. అందుకే ఆమెను నా సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకోలేకపోతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు . ఇదే వ్యాఖ్యలను మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news