Moviesఇండస్ట్రీలో అనుష్క స్థానాన్ని రీప్లేస్ చేయాలి అంటే ఆ హీరోయిన్ కే...

ఇండస్ట్రీలో అనుష్క స్థానాన్ని రీప్లేస్ చేయాలి అంటే ఆ హీరోయిన్ కే సాధ్యం..ఫ్యాన్స్ మరీ ఎక్కువ చేస్తున్నారే..!

అనుష్క శెట్టి .. టాలీవుడ్ జేజమ్మగా ఎంత పాపులారిటీ సంపాదించుకుందో మనకు తెలిసిందే. నిశ్శబ్దం శర్మ తర్వాత దాదాపు మూడేళ్ల పాటు నిశ్శబ్దంగా ఉన్నా సరే.. ఆమె తర్వాత రిలీజ్ చేసిన సినిమాను సూపర్ డూపర్ హిట్ చేశారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో అనుష్కకి సంబంధించిన ఒక న్యూస్ ని బాగా బాగా వైరల్ చేస్తున్నారు అభిమానులు.

ఇండస్ట్రీలో అనుష్క స్థానం ఎవరు భర్తీ చేయలేనిది.. ఒకవేళ ఆమె ప్లేస్ ని రీప్లేస్ చేయాలి అంటే మాత్రం కచ్చితంగా అంత పెద్ద హైట్ ఉన్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కి అది సాధ్యమవుతుంది అని చెప్పుకొస్తున్నారు . ఈ మధ్యకాలంలో మృణాల్ ఠాకూర్ పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనం చూస్తున్నాం. రీసెంట్గా నటించిన హాయ్ నాన్న సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది .

కల్కి సినిమాలో కూడా కీలక పాత్రలో కనిపించబోతుంది . దేవర సినిమాలో కూడా ఈ బ్యూటీ ఛాన్స్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . కాగా రీసెంట్గా అనుష్క స్థానాన్ని ఆమె రీప్లే చేయాలి అంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు . విక్రమార్కుడు 2 కి సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. సినిమాలో అనుష్క పాత్ర ఎంత హైలైట్ అయిందో మనకు తెలిసిందే. అయితే విక్రమార్కుడు 2 సినిమాలో అనుష్క కాకుండా ఆమెకు రీప్లేస్ గా మృణాల్ ఠాకూర్ పెడితే సినిమా హిట్ అవుతుంది అంటున్నారు జనాలు .చూద్దాం మరి మేకర్స్ ప్రొడ్యూసర్స్ ఏం డిసైడ్ చేస్తారో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news