Moviesరాజమౌళికి అమ్మ మొగుడి లాంటి డైరెక్టర్ తో రామ్ చరణ్ నెక్స్ట్...

రాజమౌళికి అమ్మ మొగుడి లాంటి డైరెక్టర్ తో రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా ఫిక్స్ .. వైరల్ అవుతున్న RC17 మూవీ డీటెయిల్స్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాంచరణ్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బాగా పబ్లిసిటీ దక్కించేసుకున్నాడు . అంతేకాదు రామ్ చరణ్ ప్రెసెంట్ టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా ప్రజెంట్ సెట్స్ పై ఉంది . ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చే సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు . రెండు సినిమాలు సెట్స్ పై ఉండగానే మూడో సినిమాకి కనెక్ట్ అయిపోయాడు రామ్ చరణ్ . సోషల్ మీడియాలో ఇన్నాళ్లు రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు అంటూ న్యూస్ బాగా బాగా ప్రచారం జరిగింది .

ఇప్పుడు ఆ న్యూస్ కన్ఫర్మ్ అయ్యే టైం దగ్గర పడిపోయింది . పుష్ప2 సినిమా షూట్ తర్వాత సుకుమార్ ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ తీసుకొని రామ్ చరణ్ తో క్రేజీ సినిమాను తెరకెక్కించబోతున్నారట . ఇది కూడా రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం అందుతుంది . మైత్రి మూవీ మేకర్స్.. ఈ సినిమాని కూడా నిర్మించబోతున్నారట . అంతేకాదు ఈ సినిమా ఓ మెసేజ్ ఓరియెంటెడ్ గా సుకుమార్ తెరకెక్కించబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. గతంలో వీళ్ళ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. మరోసారి వీళ్ళ కాంబోలో సినిమా అంటే ఆ మాత్రం హై ఎక్స్పెక్టేషన్స్ ఉండడం కామన్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news