Moviesఅన్నకు మించిపోయే రేంజ్ పాత్రలో కనిపించబోతున్న ఆనంద్ దేవరకొండ.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే...

అన్నకు మించిపోయే రేంజ్ పాత్రలో కనిపించబోతున్న ఆనంద్ దేవరకొండ.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఇది ఓ సంచలనం..?!

ఆనంద్ దేవరకొండ .. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ బ్రదర్ గా అందరికీ సుపరిచితుడే. సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఇచ్చిన ఆనంద్ దేవరకొండ తరదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు . బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు అని చెప్పలేము కానీ ఓకే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. మరీ ముఖ్యంగా ఆనంద్ దేవరకొండ తాజాగా నటించిన బేబీ సినిమా ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసింది.

ఇప్పుడిప్పుడే ఆయన కూడా ఒక హీరో అంటూ ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. కాగా ఈ క్రమంలోనే ఆయనకు వరస సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. కానీ అందరిలా వెంట వెంటనే సినిమాలు చూస్ చేసుకోకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నారు . క్వాలిటీ కంటెంట్ ఉన్న సినిమాలనే చూస్ చేసుకుంటూ ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో అని ఆ విధమైన మూవీస్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. రీసెంట్గా ఆనంద్ దేవరకొండకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.

ఆనంద్ దేవరకొండ ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలో నటించబోతున్నారట . అంతేకాదు ఈ సినిమాలో ఆయన న్యూడ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడట. గతంలో అర్జున్ రెడ్డి సినిమాలో ఆనంద దేవరకొండ బ్రదర్ విజయ్ దేవరకొండ ఎంత హాట్ గా కనిపించాడో మనకు తెలిసిందే. అయితే అన్నను మించిపోయే రేంజ్ లో ఈ హీరో న్యూడ్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడు అన్న వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది .

అంతేకాదు రెమ్యూనరేషన్ కూడా భారీగానే ఛార్జ్ చేస్తున్నాడట . హీరోస్ అంటే కేవలం ఫైట్లు.. డాన్సులే కాదు కాంట్రవర్షియల్ మెసేజ్ ఓరియెంటెడ్ కంటెంట్ కూడా టచ్ చేయాలి అన్న ఉద్దేశంతోనే ఆనంద్ దేవరకొండ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడట. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news