Moviesఓ మై గాడ్: చరణ్ సినిమాలో అది లేదా..? కొంప ముంచేశావ్...

ఓ మై గాడ్: చరణ్ సినిమాలో అది లేదా..? కొంప ముంచేశావ్ కదా బుచ్చిబాబు..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . ఇన్నాళ్లు రాంచరణ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమా ఎప్పుడెప్పుడు సట్స్ పైకి వెళ్తుందా ..? అంటూ ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని వేయిట్ చేశారు . రీసెంట్గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి . మెగాస్టార్ చిరంజీవి – బోనీకపూర్ – శంకర్- బుచ్చిబాబు సన – జాన్వి కపూర్ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

కాగా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా ఏఆర్ రెహమాన్ వర్క్ చేస్తున్నాడు . ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ బుచ్చిబాబు సనా.. చాలా కేర్ఫుల్ గా ఉంటున్నాడు అన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. ఈ సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు . అయితే ఈ సినిమాలో విలన్లే లేరు అన్న ఒక న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది .

సినిమా అంటేనే అన్ని రంగులు కలగలిపి ఉండాలి ..యాక్షన్ – థ్రిల్లర్ – రొమాన్స్ – సస్పెన్స్ ఎమోషన్ అన్నీ ఉండాలి .. మరి పాన్ ఇండియా స్టార్ చరణ్ సినిమాలో విలన్ లేకుండా బుచ్చిబాబు సన కథను ఎలా ముందుకు తీసుకెళ్లగలడు..? అన్న విషయం ఇప్పుడు అందరికీ ప్రశ్నార్ధకంగా మారింది. అంతేకాదు ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ పోషించే పాత్ర శివరాజ్ కుమార్ ది అని అంతా అనుకున్నారు .

కానీ తాజాగా ఆయన మాట్లాడుతూ..” అలాంటి క్యారెక్టర్ కాదు ఆయనది అని క్లారిటీ ఇచ్చేశారు “. దీంతో ఇన్నాళ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త నిజమని.. ఈ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ లేదు అని..చరణ్ కెరీర్ ని బిగ్ రిస్క్ లో పెడుతున్నాడు బుచ్చిబాబు సనా అంటూ మెగా ఫాన్స్ మండిపడుతున్నాడు. చూద్దాం మరి బుచ్చిబాబు సన ఈ సినిమాని ఏవిధంగా ముందుకు తీసుకెళ్తాడో..? మెగా ఫాన్స్ ని ఎలా మెప్పిస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news