Moviesమొన్నటి వరకు మెగా పవర్ స్టార్ .. సడన్గా గ్లోబల్ స్టార్.....

మొన్నటి వరకు మెగా పవర్ స్టార్ .. సడన్గా గ్లోబల్ స్టార్.. ట్యాగ్ మార్చడం వెనక కర్త-కర్మ-క్రియ మొత్తం కూడా ఆయనే..!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకి పేర్లు ముందు ఒక బిరుదు ఉంటుంది . అది జనరల్ గా వాళ్ళ ఫ్యాన్స్ ఇస్తూ ఉంటారు . అల్లు అర్జున్కి స్టైలిష్ స్టార్ అని .. చిరంజీవికి మెగాస్టార్ అని .. విజయ్ దేవరకొండకు రౌడీ హీరో అని .. విక్టరీ వెంకటేష్ కు ఫ్యామిలీ హీరో అని .. అక్కినేని నాగార్జునకు కింగ్ అని .. బాలయ్యకు నందమూరి నరసిం హం అని.. ఇలా చాలామంది హీరోలకు ఫ్యాన్స్ సపరేట్ ట్యాగ్స్ ని ఇస్తూ ఉంటారు.

ఇండస్ట్రీలోకి రాగానే చిరంజీవి కొడుకు చరణ్ కి మెగా పవర్ స్టార్ అంటూ ఒక క్రేజీ ట్యాగ్ని ఇచ్చారు. మగధీర సినిమా నుంచి నిన్నకాక మొన్న రిలీజ్ అయిన ఆర్.ఆర్.ఆర్ సినిమా వరకు మెగా పవర్ స్టార్ అంటూనే ఆయనను ముద్దుగా పిలుచుకునే వాళ్ళు అభిమానులు. సడన్ గా ఇప్పుడు ఆ ట్యాగ్ నుంచి వేరే ట్యాగ్ మారిపోయాడు . రీసెంట్గా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంటూ తన పేరుని అనౌన్స్ చేశారు.

దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. నిజానికి రామ్ చరణ్ కి గ్లోబల్ ఇమేజ్ ట్యాగ్ వచ్చింది ఆర్ ఆర్ ఆర్ మూవీతోనే. మరి గేమ్ ఛేంజర్ కి ఎందుకు గ్లోబల్ స్టార్ అని ట్యాగ్ వేసుకోలేదు ..? ఎందుకు బుచ్చిబాబు సనా సినిమాకి మాత్రమే గ్లోబల్ స్టార్ ట్యాగ్ వేశారు ..? అన్నది ప్రశ్నర్ధకంగా మారింది . అంతేకాదు బుచ్చిబాబు సనానే ఈ ఇష్యుని రైజ్ చేశాడు అని .. తన సినిమా ప్రమోషన్స్ కోసం చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వాడుకోవడానికి బాగా ట్రై చేస్తున్నాడు అని ..ఇలా ట్యాగ్ మార్చడానికి కర్త – కర్మ – క్రియ మొత్తం కూడా బుచ్చిబాబు సనానే అని చెప్పుకొస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వెరీ వెరీ హాట్ టాపిక్ గా వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news