Movies"ఆ హీరోయిన్ సినిమాలో ఉంటే నేను చేయను అని తెగేసి చెప్పిన...

“ఆ హీరోయిన్ సినిమాలో ఉంటే నేను చేయను అని తెగేసి చెప్పిన చరణ్” .. అంత కోపం ఎందుకో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది మెగా హీరోలు ఉన్నారు. మరీ ముఖ్యంగా మెగా ట్యాగ్ ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలు చాలామంది ఉన్నప్పటికీ ఆ ట్యాగ్ ను ఉపయోగించుకొని సక్సెస్ అయిన వాళ్ళు మాత్రం చాలా తక్కువ. వాళ్ళల్లో ఒకరే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మెగాస్టార్ చిరంజీవి వన్ అండ్ ఓన్లీ సన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ హీరో ప్రజెంట్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు . అంతేకాదు తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఓ రేంజ్ లో ఇండస్ట్రీ ని ఏలేస్తున్నాడు.

కాగా ఎప్పుడూ కూడా హీరోయిన్స్ విషయంలో పెద్దగా పట్టించుకోని రామ్ చరణ్ ఓ సినిమా విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ పాస్ చేశారట . తనకు ఇష్టం లేని హీరోయిన్ వద్దని చెప్పినా కూడా డైరెక్టర్ ఆ సినిమాలో పెట్టుకోచ్చారట . దీంతో కోపంతో ఊగిపోయిన రామ్ చరణ్ ఆ హీరోయిన్ ఉంటే నేను సినిమాలో చేయను అంటూ సినిమా షూట్ నుంచి వెళ్లిపోయారట. ఆ తర్వాత ఆ హీరోయిన్ తీసేసి ఆమె ప్లేస్లోకి హీరోయిన్ అమలాపాల్ ని తీసుకొచ్చారు .

ఆ సినిమా మరేదో కాదు “నాయక్”. కాజల్ అగర్వాల్ – అమలాపాల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్
గా నిలిచింది. ప్రజెంట్ రాంచరణ్ గేమ్ చేంజర్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఆ తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు . ఇలా బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news