Movies"దేవర"లో ఐటమ్ సాంగ్ చేయబోతున్న కత్తిలాంటి హీరోయిన్.. కొరటాల టేస్ట్ కెవ్వు...

“దేవర”లో ఐటమ్ సాంగ్ చేయబోతున్న కత్తిలాంటి హీరోయిన్.. కొరటాల టేస్ట్ కెవ్వు కేక అంతే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గా పాపులారిటీ సంపాదించుకున్న తారక్ ..ప్రెసెంట్ ఎంతో ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా “దేవర”. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమా కోసం హ్యూజ్ బడ్జెట్ ని కేటాయించారు నిర్మాతలు. అంతేకాదు ఇప్పటివరకు దేవర సంబంధించిన రిలీజ్ అయిన పిక్చర్స్ పోస్టర్స్ అన్నీ కూడా అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి .

ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఎన్టీఆర్ కి జోడిగా నటించబోతుంది . ఈ సినిమాలో రెండో హీరోయిన్ కూడా ఉంది అని ఆ హీరోయిన్ ని సస్పెన్స్ లో ఉంచారు కొరటాల శివ అంటూ ప్రచారం జరుగుతుంది . కాగా ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల చేత అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు . అంతేకాదు ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఇదే మూమెంట్లో ఈ సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో లీకై వైరల్ అవుతుంది. జనరల్ గా కొరటాల శివ ఐటెం సాంగ్స్ విషయంలో చాలా లైట్ గా ఉంటారు కానీ దేవర సినిమా విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారట . కచ్చితంగా ఈ పాట ఓ రేంజ్ లో ఊపేయాలి అంటూ బాలీవుడ్ హాట్ బ్యూటీ నూరా ఫతేహీను తీసుకొస్తున్నారట. దేవర సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నూరా ఫతేహి ఐటమ్ సాంగ్ చేయబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news