Movies"ఆమె వేస్ట్".. అనుకున్న ఆ హీరోయిన్ తోనే రెండు సార్లు స్క్రీన్...

“ఆమె వేస్ట్”.. అనుకున్న ఆ హీరోయిన్ తోనే రెండు సార్లు స్క్రీన్ షేర్ చేసుకున్న బన్నీ .. ఎవరో గుర్తుపట్టారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ కి ఎలాంటి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది అనే విషయం చెప్పాల్సిన అవసరం లేదు . ప్రెసెంట్ పుష్ప 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది . ఆఫ్ కోర్స్ ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. కానీ కొన్ని అనివార్య కారణాల చేత కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ అవ్వడం కారణంగా పుష్ప సినిమా కూడా ఆలస్యం అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది .

అయితే అలాంటిది ఏదీ లేదు అంటూ టీం క్లారిటీ ఇచ్చేసింది . ఆగస్టు 15వ తేదీ ఎట్టకేలకు ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అంటూ బన్నీ సుకుమార్ పరోక్షకంగా పోస్ట్ ద్వారా కన్ఫామ్ చేసేసారు . ఇలాంటి మూమెంట్లోనే అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . అల్లు అర్జున్ తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు . మరి ముఖ్యంగా హీరోయిన్స్ షూటింగ్ విషయం గురించి అయితే అస్సలు చెప్పనవసరం లేదు . అల్లు అర్జున్ తన సినిమాల్లో నటించే హీరోయిన్స్ ని తానే చూస్ చేసుకుంటాడు .

అయితే ఇద్దరమ్మాయిలు సినిమా టైంలో అమలాపాల్ – కేథరిన్ లను హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ చూస్ చేశారట. ఆయన కథకు వాళ్లే బాగుంటారు అంటూ ఫిక్స్ అయ్యారట . అమలాపాల్ ఓకే కానీ క్యాథరిన్ పర్ఫామెన్స్ చూసి బన్నీ ఆమె ఇండస్ట్రీకి పనికిరాదు వేస్ట్ అంటూ తేల్చేసాడట . అయితే పూరి జగన్నాథ్ మాత్రం లేదు ఆమెకి ఛాన్స్ ఇవ్వాలి అంటూ పట్టు పట్టడంతో ఇష్టం లేకపోయినా ఆమెతో రొమాన్స్ చేసి డాన్స్ చేశాడు.

అయితే టాప్ లేచిపోద్ది సాంగ్ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత బన్నీ మైండ్ బ్లాక్ అయ్యిపోయిందట. క్యాధరిన్ లో ఇంత పర్ఫామెన్స్ ఉందా ..? అంటూ షాక్ అయిపోయాడట . ఆ తర్వాత సరైనోడు సినిమాలో కూడా ఆయనే అడిగిమరీ ఏది కోరి ఆమెను హీరోయిన్గా పెట్టించుకున్నాడట . బన్నీ – కేథరిన్ మంచి ఫ్రెండ్స్ గా కూడా మారిపోయారు. ప్రజెంట్ కేథరిన్ అవకాశాలు లేక అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంది వచ్చిన అవకాశాలతో సరిపెట్టుకోవాలి అంటూ డిసైడ్ అయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news