Moviesఫస్ట్ టైం ఆ విషయంలో అభిమానులను డీప్ గా హర్ట్ ...

ఫస్ట్ టైం ఆ విషయంలో అభిమానులను డీప్ గా హర్ట్ చేసిన బన్నీ.. గుర్రుగా ఉన్న ఫ్యాన్స్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ఫ్యాన్స్ ని అల్లు అర్జున్ బాధపెట్టాడా..? అంటే ఎస్ అంటూ సమాధానమే వినిపిస్తుంది . దానికి కారణం ప్రభాస్ అంటూ తెలుస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ గా పాపులర్టీ సంపాదించుకున్న ప్రభాస్ ఏ రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ముందుకు దూసుకెళ్తున్నాడో మనకు తెలుసు.

ప్రభాస్ నటించిన తాజా సినిమా కల్కి. మే తొమ్మిదవ తేదీ ..ఈ సినిమా రిలీజ్ కాబోతోంది . అయితే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సందర్భంగా ఈ సినిమాను పోస్ట్ పోన్ చేస్తూ ఆగస్టు 15న రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారట . కానీ అదే మూమెంట్ కి ఆల్రెడీ అల్లు అర్జున్ .. పుష్ప సినిమాతో ముందుగానే డేట్ ని లాక్ చేసి పెట్టుకున్నాడు . కానీ ప్రభాస్ కాల్ చేసి అడగడంతో అల్లు అర్జున్ .. ఆ డేట్ ని ఇచ్చేసాడట .

అందుతున్న ప్రకారం ఆగస్టు 15వ తేదీ కల్కి సినిమా రిలీజ్ కాబోతుంది . అంతేకాదు పుష్ప సినిమాలో సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యే విధంగా పోస్ట్ పోన్ చేసుకున్నారట . దీంతో ఫాన్స్ మండిపడుతున్నారు. ” మీ ఫ్రెండ్షిప్ కోసం అవమానుల మనసులను హర్ట్ చేస్తారా..? అంటూ ఫైర్ అవుతున్నారు”. ఒకపక్క ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగానే ఉన్న మరొక పక్క బన్నీ ఫాన్స్ మాత్రం గుర్రుగా ఉన్నారు.

ఈ మధ్యకాలంలో స్టార్స్ తమ సినిమాల డేట్ కోసం ముందుగానే అన్ని చూసుకుంటూ వస్తున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల చేత అవి పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నాయి . బన్నీ ఎప్పుడో తన సినిమాని ఆగస్టు 15న రిలీజ్ చేయాలి అంటూ తన సినిమా డేట్ లాక్ చేసుకుని ఉండగా ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ డేట్ ను వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది..???

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news