Moviesర‌జ‌నీకాంత్ ప‌రువు తీసేసిన కూతురు ఐశ్వ‌ర్య‌... ఇంత దారుణ‌మా...!

ర‌జ‌నీకాంత్ ప‌రువు తీసేసిన కూతురు ఐశ్వ‌ర్య‌… ఇంత దారుణ‌మా…!

కోలీవుడ్ సూపర్ స్టార్ తళైవర్ రజినీకాంత్ వ‌య‌స్సు ఏడు ప‌దుల‌కు చేరువు అవుతున్నా ఇప్ప‌ట‌కీ క్రేజ్ ఏ మాత్రం చెక్కు చెద‌ర్లేదు. ర‌జ‌నీ సినిమాలు వ‌స్తున్నాయంటే చాలు హిట్లు, ప్లాపుల‌తో సంబంధం లేకుండా మంచి బ‌జ్ ఉంటుంది. ర‌జ‌నీ సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతోందంటే ర‌జ‌నీ అభిమానుల‌కు పెద్ద పండ‌గ వాతావ‌ర‌ణం. మిగిలిన సినీ అభిమానుల్లో కూడా మంచి ఉత్కంఠ ఉంటుంది. ఓపెనింగ్స్ కూడా కుమ్మేస్తాయి.

గత పదేళ్ల‌లో ర‌జ‌నీకి హిట్లు త‌క్కువ‌.. ప్లాపులు చాలా ఎక్కువ‌. జైల‌ర్ సినిమాతో ర‌జ‌నీ స‌త్తా ఏంటో ఫ్రూవ్ అయ్యింది. ఈ వ‌య‌స్సులోనూ అదిరిపోయే హిట్ కొట్టాడు. జైల‌ర్‌తో ర‌జ‌నీకి నిజ‌మైన కం బ్యాక్ ద‌క్కింది. అయితే ఇప్పుడు ర‌జ‌నీ గెస్ట్ రోల్ చేసిన లాల్ స‌లాం సినిమాకు మాత్రం జీరో బ‌జ్ క‌నిపిస్తోంది. సోష‌ల్ మీడియాలోనూ అస‌లు ఈ సినిమా గురించి ఊసేలేదు. క‌నీసం ర‌జ‌నీ వీరాభిమానులు కూడా ఈ సినిమాను ప‌ట్టించుకున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు.

తెలుగులో అయితే టోట‌ల్ జీరో బ‌జ్‌.. క‌నీసం త‌మిళంలో అయినా ఈ సినిమాకు ఏదైనా బ‌జ్ ఉందా ? అంటే లేద‌నే చెప్పాలి. అసలు ట్రేడ్ ప‌రంగా కూడా ఈ సినిమాపై మినిమం ఆస‌క్తి లేదంటే అర్థం చేసుకోవ‌చ్చు. విష్ణు విశాల్‌, విక్రాంత్ సంతోష్ హీరోలుగా న‌టించిన ఈ సినిమాలో ర‌జ‌నీ గెస్ట్ రోల్ చేశారు. ర‌జ‌నీ కుమార్తె ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఐశ్వ‌ర్య త‌న తండ్రి సినిమాను డైరెక్ట్ చేస్తోందంటే అంచ‌నాలు ఎలా ? ఉండాలి. ఓ రేంజ్‌లో ఉండాలి. అయితే సినిమాపై త‌మిళ‌నాడులోనూ, ఇటు ర‌జ‌నీ అంటే ప‌డిచ‌చ్చే వీరాభిమానుల్లోనూ మినిమం బ‌జ్ క్రియేట్ చేయ‌లేక దారుణంగా విఫ‌ల‌మైంది. ర‌జ‌నీయే స్వ‌యంగా రంగంలోకి దిగి ఈ సినిమాకు బ‌జ్ క్రియేట్ చేయాల‌ని అంద‌రూ కోరుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news