Moviesఅద‌ర‌గొట్టిన ' అంబాజీపేట మ్యారేజీ బ్యాండు ' వ‌సూళ్లు... షాకింగ్ లెక్క‌లు..!

అద‌ర‌గొట్టిన ‘ అంబాజీపేట మ్యారేజీ బ్యాండు ‘ వ‌సూళ్లు… షాకింగ్ లెక్క‌లు..!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు సుహాస్ హీరోగా కొత్త హీరోయిన్ శివాని నాగారం హీరోయిన్‌గా తెర‌కెక్కిన సినిమా అంబాజీపేట మ్యారేజీ బ్యాండు. కొత్త ద‌ర్శ‌కుడు దుష్యంత్ కటికనేని తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే మంచి హైప్ తెచ్చుకుంది. టీజ‌ర్లు, ట్రైల‌ర్లు, ప్ర‌చార చిత్రాలు సినిమాపై మంచి బ‌జ్ పెంచేశాయి.

ప్ర‌చారంలోనే సినిమాకు పాజిటివ్ బ‌జ్ వ‌చ్చేసింది. మంచి ప్ర‌మోష‌న్లు, అంచ‌నాల మ‌ధ్య‌లో రిలీజ్ అయిన సినిమా తొలి రోజు సాలిడ్ రెస్పాన్స్‌తో అదిరిపోయే వ‌సూళ్లు సొంతం చేసుకుంది. డే 1 ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా 2.28 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. రెండో రోజు కూడా థియేట‌ర్ల‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉంది.

ఇక ఫిబ్ర‌వ‌రి ఆరంభంలోనే మంచి టాక్‌తో ఈ సినిమా టాలీవుడ్ వ‌ద్ద జ‌ర్నీ స్టార్ట్ చేసింది. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందించగా ధీరజ్ మొగలినేని నిర్మాణం వహించారు అలాగే ప్రముఖ నిర్మాత బన్నీ వాసు తన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ సమర్పణలో రిలీజ్ చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news