Moviesసంచలన నిర్ణయం తీసుకున్న నాచురల్ స్టార్ నాని..ఇక ఒక్కోక్కడికి పులుసు కారిపోవాల్సిందే..!!

సంచలన నిర్ణయం తీసుకున్న నాచురల్ స్టార్ నాని..ఇక ఒక్కోక్కడికి పులుసు కారిపోవాల్సిందే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . నాచురల్ స్టార్ నాని టాలీవుడ్ చరిత్రను తిరగరాయబోతున్నాడా…? అంటే యస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో నాని నటిస్తున్న సినిమా సరిపోదా శనివారం . ఈ సినిమాని డీవివి ఎంటర్టైన్స్ బ్యానర్ లో దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు . సినిమాలో నానికి జోడిగా ప్రియాంక ఆర్మూల్ మోహన్ నటిస్తుంది .

వివేక ఆత్రేయతో నాని ఆల్రెడీ అంటే సుందరానికి సినిమా చేశాడు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు . అయినా సరే మరో బిగ్గెస్ట్ రిస్క్ చేస్తున్నాడు ఆత్రేయ. కాగా సరిపోదా శనివారం కి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. పూర్తిగా ఢిఫరెంట్ కాన్ సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అందుతున్న సమాచారం ప్రకారం నాని దాదాపు ఈ సినిమా కోసం 45 కోట్ల దాకా రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నాడట .

నిజానికి నాని తన ప్రతి సినిమాకి 15 – 20 – 25 కోట్ల వరకే ఛార్క్ చేస్తాడట . కానీ ఈ సినిమా కోసం మాత్రం దాదాపు 45 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడట . దసరాతో 100 కోట్ల క్లబ్ లోకి చేరిన నాని ఆ తర్వాత హాయ్ నాన్నతో కూడా డీసెంట్ హిట్ అందుకున్నాడు. అందుకే తాను కెరియర్లో ఎదగాలి అన్న కారణంగా నాని ఇలాంటి డెసిషన్ తీసుకున్నారట. టైర్ 2 హీరోలల్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో నానినే కావడం గమనార్హం అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇదే కొనసాగితే నాని చరిత్ర సృష్టించడం పక్కా అంటున్నారు జనాలు. నాని ఫ్యాన్స్ మాత్రం ఇక ఒక్కోక్కడికి పులుసు కారిపోవాల్సిందే అంటూ కౌంటర్స్ వేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news