Moviesఎప్పుడు కూల్ గా ఉండే అమల..ఆ టైంలో మాత్రం గుండెల్లో రైళ్లు...

ఎప్పుడు కూల్ గా ఉండే అమల..ఆ టైంలో మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెడుతాయా..? అంత పిరికిదా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగార్జున భార్యగా అమలా కూడా అలాంటి స్థానాన్ని అందుకుంది . కాగా ఒకప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేసిన అమల .. పెళ్లి తర్వాత హీరోయిన్ గా సినిమాలు చేయలేదు. అరా కొరా కీలక పాత్రలో కనిపించి మెప్పించింది . రీసెంట్గా అమల ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి .

నాగచైతన్య నా వద్ద పెరగలేదు అని ఆమె చెప్పిన మాటలను హైలెట్ చేస్తున్నారు అభిమానులు. అమల మాట్లాడుతూ..” అందరూ అనుకున్నట్లు నాగచైతన్య నా వద్ద పెరగలేదు ..చెన్నైలో వాళ్ళ అమ్మ వద్దనే ఉండేవాడు ..అప్పుడప్పుడు మాత్రమే ఇక్కడికి వచ్చేవాడు.. అయినా మా మధ్య బాండింగ్ బాగుండేది . వాళ్ళ నాన్నతోనే ఎక్కువగా గడిపేవాడు. మంచి హ్యూమన్ బీయింగ్. అఖిల్ నాగచైతన్య బాండింగ్ చాలా వెరైటీగా ఉంటుంది . నాగచైతన్య ఏది చేస్తే అఖిల్ అదే చేయాలి అని అటువైపుగా వెళ్లేవాడు”..

” చిన్నప్పటి నుంచి అంతే ..అఖిల్ కి చైతన్య ఓ మంచి అన్నయ్య ..అఖిల్ చైతన్య ఎక్కడ ఉన్నా సరే బాగా మింగిల్ అయిపోతారు .. ఎప్పుడైనా అఖిల్ ఇంటికి వచ్చేసి చైతూ లేటుగా వస్తే.. అఖిల్ అన్న కోసం వెయిట్ చేసేవాడు.. నాగచైతన్య అంత నాటి కాదు కానీ, అఖిల్ టూ నాటీ. హైపర్ యాక్టీవ్. వీరిద్దరి సినిమాలో రిలీజ్ అవుతున్నాయి అంటే నాకు గుండెల్లో దడ పుట్టేస్తుంది . నాగార్జున చిత్ర ఫలితం నుండి ఒకటి రెండు రోజుల్లో బయటకు వచ్చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడతారు” అని అమలా చెప్పుకొచ్చింది. అమలా మాటలను బట్టి చూస్తే చైతుకి అమలతో బలమైన సంబంధం లేకపోయినప్పటికీ అఖిల్ తో మాత్రం మంచి ర్యాపో బాండింగ్ ఉంది అంటూ తెలుస్తుంది . ప్రజెంట్ నాగచైతన్య పై అమలా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news