Movies"ఒరేయ్ వద్దురా.. నా పేరు చెప్పి అలా చేయొద్దు".. సెన్సేషనల్ వీడియోని...

“ఒరేయ్ వద్దురా.. నా పేరు చెప్పి అలా చేయొద్దు”.. సెన్సేషనల్ వీడియోని రిలీజ్ చేసిన నాగార్జున..!

అక్కినేని నాగార్జున .. ఏం చేసినా వెరైటీ గానే చేస్తాడు. సినిమా ప్రమోషన్స్ విషయంలో డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాటజీలను వర్కౌట్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా అక్కినేని నాగార్జున నటించిన సినిమా నా సామి రంగ . ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది . మంచి పాజిటివ్ రివ్యూస్ అందుకుంది . నాగార్జున నటన కు మంచి మార్కులే వచ్చాయి .

సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ను ఓ రేంజ్ లో పొగిడేసారు జనాలు . రీసెంట్గా ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ లోకి అందుబాటులోకి వచ్చింది నా సామి రంగ .కాగా ఈ సినిమాని చూడాలి అంటూ నాగ్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు . ఈ క్రమంలోనే తన ఫ్యాన్స్ పంపిన లెటర్స్ చదివి ధన్యవాదాలు తెలుపుతాడు . అందులో ఓ నెటిజెన్..” మా నాన్నకు మీరంటే చాలా చాలా ఇష్టం అండి.. నా పదేళ్ల వయసులో ఉన్నప్పుడు నాగార్జున పుట్టినరోజు సెలబ్రేట్ చేయడానికి మా నాన్న జోబిలో 600 రూపాయలు దొంగతనం చేశాను ” అంటూ రాసుకోచ్చాడు.

అది చదివిన నాగార్జున ..”ఒరేయ్ వద్దు .. నా పేరు చెప్పి మరి ఇలా దొంగతనాలు చేయొద్దు ” అంటూ నవ్వుతూ చెప్పాడు . ఆ తర్వాత ఓ లేడీ ఫ్యాన్ అమల అనే ఆమె లెటర్ చదివాడు అలా డిఫరెంట్ డిఫరెంట్ లెటర్స్ చదివి నాగార్జున ఎమోషనల్ అయ్యారు. ఫైనల్లీ నా సామీ రంగా చూడండి అంటూ చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news