Movies40 ఏళ్ల బ్యాచిలర్ హీరోయిన్.. 20 ఏళ్ళ సినిమా కెరీర్ .....

40 ఏళ్ల బ్యాచిలర్ హీరోయిన్.. 20 ఏళ్ళ సినిమా కెరీర్ .. ఈ బ్యూటీ ఎన్ని కోట్లు సంపాదించిందో తెలిస్తే మతులు పోతాయ్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ బ్యూటీ ఎవరు అంటే మాత్రం టక్కున చెప్పే పేరు అందాల ముద్దుగుమ్మ త్రిష . ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చూసే కొద్ది ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుంది. అలాంటి అందం ఆమె సొంతం. వయసు 40 దాటేసిన సరే ఇంకా పర్ఫెక్ట్ ఫిగర్ ని మెయింటైన్ చేస్తూ కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది . ఫస్ట్ ఇన్నింగ్స్ లో సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేసిన త్రిష ..సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదే రేంజ్ లో సినిమాలను చూస్ చేసుకుంటుంది .

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆమె చేతిలో ఆరు బడా ప్రాజెక్టులు ఉన్నాయి . మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభరలో కూడా త్రిషనే హీరోయిన్గా నటిస్తుంది . ఇలాంటి క్రమంలోనే త్రిష ఆస్తులకు సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి . 40 ఏళ్ల త్రిష 20 ఏళ్లకు పైగానే ఇండస్ట్రీలో రాజ్యమేలేస్తుంది. మొత్తంగా ఆమె 100 కోట్లకు పైగానే ఆస్తులు సంపాదించుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

సినిమాలతో పాటు పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించి చేతినిండా సంపాదిస్తుంది ఈ బ్యూటీ. ఒక్కొక్క సినిమాకి 5 – 6 – 7 కోట్లు ఛార్జ్ చేసే ఈ బ్యూటీ యాడ్స్ కి మాత్రమే 10 – 15 కోట్లు ఛార్జ్ చేస్తుందట . అంతేకాదు త్రిషకు హైదరాబాద్లో ఇల్లులు ఉన్నాయి. చెన్నైలో 10 కోట్లు విలువైన విలాసవంతమైన భవనం కూడా ఉంది . ఆరు కోట్లతో హైదరాబాదులో కొత్త ఇల్లు కట్టుకునింది. ఆమెకు రకరకాల కార్లు అంటే ఇష్టం . ప్రత్యేకంగా గార్డెన్ కూడా పెట్టించుకునింది . త్రిష గ్యారేజ్ లో కాస్ట్లీ కార్లు చాలానే ఉన్నాయి . నచ్చినట్టు లైఫ్ని లగ్జరీయస్ గా బ్రతుకుతుంది త్రిష . అయితే పెళ్లి చేసుకుంటుందో లేదో మాత్రం డౌటే అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news