Moviesనితిన్ ' రాబిన్‌హుడ్ ' స్టోరీ ఇదే... గ్లింప్స్ వీడియోతోనే హిట్...

నితిన్ ‘ రాబిన్‌హుడ్ ‘ స్టోరీ ఇదే… గ్లింప్స్ వీడియోతోనే హిట్ కొట్టేశాడు ( వీడియో )

క్రేజీ హీరో నితిన్ తాజాగా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చినా ఆ సినిమా అంచ‌నాలు అందుకోలేదు. ప్ర‌స్తుతం నితిన్ – టాలెంటెడ్ డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల‌తో క‌లిసి రెండోసారి ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. మైత్రీ సంస్థ నిర్మించే ఈ సినిమా ప్ర‌క‌టించిన తొలి రోజే మంచి హైప్ వ‌చ్చింది. రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా ఈ రోజు ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ ఓ గ్లింప్స్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు.

ఈ సినిమా టైటిల్ కూడా రివీల్ అయిపోయింది. రాబిన్‌హుడ్ అనే టైటిల్ పెట్టారు. భార‌తీయులు అంద‌రిని త‌న సోద‌రులు, సోద‌రిమ‌ణులుగా భావించే నితిన్ పాత్ర‌ను ప‌రిచ‌యం చేయ‌డానికి ఉద్దేశించిన గ్లింప్స్ వీడియో ఆక‌ట్టుకుంది.డ‌బ్బు దొంగిలించ‌డానికి అన్ని హ‌క్కులు త‌న‌కు ఉన్నాయ‌ని నితిన్ భావిస్తూఉంటాడు. డ‌బ్బు చాలా చెడ్డ‌ది… రూపాయి రూపాయి నువ్వేం చేస్తావ్ అంటే అన్న‌ద‌మ్ములు, అన్నా చెల్లెళ్ల మ‌ధ్య చిచ్చు పెడ‌తాను అంటూ.. అన్న‌ట్టే చేస్తుంది.

దేశం అంతా నా కుటుంబం, ఆస్తులున్నోళ్లంతా నా అన్న‌ద‌మ్ములు, ఆభ‌రాణాలు ఏసుకున్నోళ్లంతా నా వారు.. అయినా కూడా నా మీద కేసులు పెడుతున్నారు.. నేను హ‌ర్ట్ అవ్వ‌లేదు.. అందుకే అయిన వాళ్ల ద‌గ్గ‌ర డ‌బ్బులు తీసుకోవ‌డం నా హ‌క్కు.. ఎందుకంటే భారతదేశం నా దేశం. భారతీయులందరూ నా సోదరులు, సోదరీమణులు అంటూ నితిన్ డైలాగ్‌తో పరిచయం ఇచ్చాడు. నితిన్ గెట‌ప్‌, యాక్ష‌న్ వినోదంగా ఉన్నాయి.

నితిన్ త‌న బ్యాగులో నుంచి డ‌బ్బు, బంగారంతో శాంతాక్లాజ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. బైక్ ముందు భాగంగానే నేను భార‌తీయుడిని అని రాసి ఉంటే.. వెన‌క బాగంలో నేను చాలా రేర్ అని ఉంది. నితిన్ స్టైలీష్ మేకోవ‌ర్‌లో చాలా కూల్‌గా ఉన్నాడు. ద‌ర్శ‌కుడు వెంకీ సీరియ‌స్ సీన్ల‌ను కూడా కామెడీగా తీశారు. త‌న తొలి రెండు సినిమాల‌ను చాలా విభిన్న‌మైన స‌బ్జెక్టుల‌ను ఎంచుకుని హిట్ కొట్టిన వెంకీ ఇప్పుడు మ‌రో ఇంట్ర‌స్టింగ్ ప్రాజెక్టుతో ముందుకు వ‌చ్చాడు. టైటిల్ టీజ‌ర్ క‌ట్‌లోనే త‌న మార్కెంటో చూపించాడు. ఏదేమైనా టీజ‌ర్‌తోనే సినిమాకు హిట్టు క‌ళ అయితే క‌నిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news