Moviesఆల్ ఇండియా రికార్డ్ సృష్టించిన తేజా సజ్జ.. హనుమాన్ కి అరుదైన...

ఆల్ ఇండియా రికార్డ్ సృష్టించిన తేజా సజ్జ.. హనుమాన్ కి అరుదైన గౌరవం..!!

ఇది నిజంగా తేజ సజ్జ అభిమానులకు ఎగిరి గంత్తేసే న్యూస్ అని చెప్పాలి . టాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీయర్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు హీరోగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న తేజ.. తాజాగా నటించిన సినిమా హనుమాన్ . ఈ మూవీని ప్రశాంత్ వర్మ తనదైన స్టైల్ లో డైరెక్టర్ చేశాడు. ఇందులో వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్ కుమార్ , గెటప్ శ్రీను , సత్యా తదితరులు కీలకపాత్రలో కనిపించారు .

ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్స్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అందుకుంది . మరీ ముఖ్యంగా సినిమాలో తేజ సజ్జా నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ గురించి అయితే అస్సలు చెప్పనవసరం లేదు . థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్క అభిమాని కూడా తేజ సజ్జాను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు . రీసెంట్గా ఈ సినిమా ఆల్ ఇండియా రికార్డ్స్ సృష్టించింది .

పెయిడ్ ప్రీమియర్స్ విషయంలో అత్యధిక వసూలు సాధించిన ఏకైక సినిమాగా గుర్తింపు పొందింది. ఈ విషయాన్ని తెలుపుతూ హనుమాన్ మేకర్స్ ట్విట్టర్ వేదికగా స్పెషల్ పోస్ట్ ని కూడా షేర్ చేశారు . దీంతో తేజ సజ్జ అరుదైన ఘనత అందుకున్నాడు. యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం హనుమాన్‌. సూపర్ హీరో ఫిల్మ్ గా ఈరోజు శుక్రవారం(జనవరి 12న) గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news