Moviesమహేశ్ ఫ్యాన్స్ కి మండిస్తున్న శ్రీలీల అభిమానులు.. పాపం సూపర్...

మహేశ్ ఫ్యాన్స్ కి మండిస్తున్న శ్రీలీల అభిమానులు.. పాపం సూపర్ స్టార్ పరువు పాయే..!!

శ్రీ లీల.. ఈ మధ్యకాలంలో ఈ పేరు ఎంత బాగా పాపులారిటీ సంపాదించుకుంటుందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ కన్నడ పిల్ల రీసెంట్గా గుంటూరు కారం సినిమాలో నటించింది. ఎంత పెద్ద హీరోయిన్ అయినా సరే పక్కన స్టార్ హీరో ఉంటే కచ్చితంగా ఫ్లెక్సీలో ఆయన ఫోటోనే ముందు ఉంటుంది. కానీ గుంటూరు కారం సినిమా విషయంలో మాత్రం అంతా పరిస్థితి తలకిందులైపోయింది .

శ్రీ లీల డైహార్ట్ అభిమానులు మహేష్ బాబుని పక్కన పెట్టేసి శ్రీ లీల ఫొటోస్ ని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ భారీ భారీ ఫ్లెక్సీలతో కటౌట్లతో ఆమెను ఓ రేంజ్ లో ఆరాధించడం మొదలుపెట్టారు . రీసెంట్గా ఓ అభిమాని గుంటూరు కారం సినిమా పోస్టర్ ని క్రియేట్ చేస్తూ, శ్రీ లీల డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ ని ఫ్లెక్సీలో పెట్టించారు. అంతేకాదు పక్కనే వాళ్ళ ఫోటోలను ముద్రించుకుంటూ “గుంటూరు కారం ఘాటు ..మూవీకి శ్రీ లీల స్వీటు.. అందుకే నువ్వే నా హార్ట్” అనే ఓ డైలాగ్ తో రచ్చ రంబోలా చేశారు .

అయితే ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఆ ఫ్లెక్సీలో మహేష్ బాబు ఏదో పైన ఒక మూలగా ఉన్న ఫోటో కనిపిస్తుంది . దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అంత పెద్ద హీరోకి కనీస గౌరవం కూడా ఇవ్వరా అంటూ మండిపడుతున్నారు . మరికొందరు ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి గొప్ప అంటూ శ్రీ లీల అభిమానులను ఎంకరేజ్ చేస్తున్నారు . మొత్తానికి గుంటూరు కారం ఫ్యాన్స్ మధ్య బాగానే చిచ్చు పెడుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news