Newsశ్రీలీల-మీనాక్షి చౌదరి "గుంటూరు కారం" లుక్స్ లో ఈ డిఫరెన్స్ గమనించారా.....

శ్రీలీల-మీనాక్షి చౌదరి “గుంటూరు కారం” లుక్స్ లో ఈ డిఫరెన్స్ గమనించారా.. త్రివిక్రమ్ భలే ట్విస్ట్ ఇచ్చారే..!

“గుంటూరు కారం”.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు మారుమ్రోగిపోతుంది . సినిమా ఇండస్ట్రీలో.. వెబ్ మీడియాలో .. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో నటించబోతున్న మహేష్ బాబు మూవీ గుంటూరు కారం సినిమాకి సంబంధించి వార్తలు వైరల్ అవుతున్నాయి . సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్ .

ఈ పోస్టర్లో మహేష్ బాబు చాలా క్లాస్ గా కూర్చొని ఉండగా ఆయన వెనకాల మీనాక్షి చౌదరి లంగా వోణీలో ఆయనకు మెడ వత్తుతున్నట్లు చాలా నాటి పోస్టర్ రిలీజ్ చేశారు . కాగ ఈ పోస్టర్ చూసిన జనాలు అందరికీ మీనాక్షి లో ఈ యాంగిల్ కూడా ఉందా..? అంటూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు మీనాక్షి శ్రీలీల ల క్యారెక్టర్స్ మధ్య డిఫరెన్స్ ను కనిపెడుతున్నారు. కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం మీనాక్షి చౌదరి శ్రీ లీల ఇద్దరు కూడా మహేష్ బాబుకి మరదలు అవుతారు .

అంతేకాదు మీనాక్షి చౌదరి ఫారిన్ నుంచి వచ్చి ఆయన కోసం ట్రెడిషనల్ గా మారుతుంది . శ్రీ లీల పల్లెటూరులోనే పుట్టి పెరిగి తన బావే తన ప్రాణంగా అనుకుంటుంది . ఇలా ఇద్దరి మధ్య బాగా నలిగిపోతాడు మహేష్ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు వాళ్లు రిలీజ్ చేసిన పోస్టర్ ల ఆధారంగా కూడా అది తెలిసిపోతుంది. శ్రీ లీల పల్లెటూరి లుక్స్ చూస్తే అచ్చం పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మాయిలానే కనిపిస్తుంది. మీనాక్షి చౌదరి ఫారిన్ నుంచి వచ్చి ట్రెడిషనల్ లుక్స్ లో కనిపించడానికి బావని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసే అమ్మాయి అని పోస్టర్ ని చూస్తే అర్థమయిపోతుంది. దీంతో ఇద్దరు మరదలు మధ్య ఈ బావ ఎలా నలిగిపోయాడో తెలియాలి అంటే జనవరి 12న థియేటర్స్ కి వెళ్లి చూడాల్సిందే అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news