Moviesనాగార్జున కోసం అతి పెద్ద త్యాగం చేసిన రవితేజ.. ఏ హీరో...

నాగార్జున కోసం అతి పెద్ద త్యాగం చేసిన రవితేజ.. ఏ హీరో చేయలేని పని..దట్ ఈజ్ మాస్ మహ రాజా..!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఏ హీరో సినిమా ఎప్పుడు హిట్ అవుతుంది.. ఏ హీరో సినిమా ఎప్పుడు ఫట్ అవుతుంది అని చెప్పడం చాలా గగనంగా మారిపోయింది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం బాగా గమనించినట్లయితే బడా హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అవుతున్నాయి . చిన్నచితకా హీరోలు నటించిన సినిమాల హిట్ అవుతున్నాయి. ఆ కారణంగానే ఏ సినిమా హిట్ అవుతుందని గెస్ చేయలేకపోతున్నాం.

కాగా గత కొంతకాలంగా ఫ్లాప్ లతో సతమతమైపోతున్న నాగార్జున ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా “నా సామి రంగ”. జనవరి 14న ఈ సినిమా రిలీజ్ చేయడానికి మేకర్స్ ఫుల్ పకడ్బందీగా ప్లాన్ చేశారు . అయితే అదే రోజు రవితేజ నటించిన ఈగల్ సినిమా కూడా రిలీజ్ కావాల్సి ఉంది . కానీ అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ ఈ రేస్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది.

జనవరి 26న పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో అదే రోజు రవితేజ తన సినిమాను థియేటర్లోకి తీసుకొస్తున్నాడట . అంతేకాదు ఈగల్ పోస్ట్ పోన్ చేయడంతో ఆ థియేటర్స్ అన్ని కూడా నా సామీ రంగాకు కేటాయించేస్తున్నారట . దీంతో ఏ హీరో చేయలేని పని చేశాడు రవితేజ ..అక్కినేని నాగార్జున కోసం అంటూ మాస్ మహారాజా ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news