Movies"ఇక నుంచి ప్రతి సంక్రాంతికి కూడా అదే చేస్తా ".. ప్రశాంత్...

“ఇక నుంచి ప్రతి సంక్రాంతికి కూడా అదే చేస్తా “.. ప్రశాంత్ వర్మ సంచలన ప్రకటన..!!

ప్రశాంత్ వర్మ.. ఈ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో మారు మ్రోగిపోతుందో మనకు తెలిసిందే. హనుమాన్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ట్ డైరెక్టర్ గా మారిపోయాడు ప్రశాంత్ వర్మ . ఆయన తెరకెక్కించిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసి పడేస్తుంది . బడా బడా హీరోల సినిమాలు రిలీజ్ అయిన సరే చిన్న హీరోగా తెరకెక్కిన హనుమాన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకునింది .

ఇలాంటి క్రమంలోనే తాజాగా హనుమాన్ సక్సెస్ తర్వాత ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ..” నా సినిమాటిక్ యూనివర్స్ లో దాదాపు 20 సినిమాలకు పైగానే ఉన్నాయి. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క సూపర్ హీరో ఉంటాడు . ఫస్ట్ ఫేస్ లో ఆరు సినిమాలు వస్తాయి. ఆ తర్వాత మిగిలినవి వస్తాయి. అవన్నీ నేనే డైరెక్ట్ చేయను”.

” కొత్త దర్శకులు కూడా పరిచయం అవుతూ ఉంటారు. కేవలం హీరోలే కాదు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో కూడా వస్తాయి . ఈ సినిమాటిక్ యూనివర్స్ కి సంబంధం లేకుండా ఇంకో మూవీ కూడా చేస్తున్నాను.. త్వరలోనే వాటి డీటెయిల్స్ అన్ని మీకు చెప్తాను. కుదిరితే ప్రతి సంక్రాంతికి నా సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఒక సినిమా ఉంటుంది “అంటూ సంచలన ప్రకటన చేశాడు ప్రశాంత్ వర్మ. ప్రజెంట్ ఆయన మాటలు వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news