Moviesఓరి దేవుడోయ్.. ఇదెక్కడి మాయ రోగం.. సమంతకి అవి అంటే అంత...

ఓరి దేవుడోయ్.. ఇదెక్కడి మాయ రోగం.. సమంతకి అవి అంటే అంత భయమా..?

ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ సమంతకి పూలు అంటే పడవా..? ఇదెక్కడ విచిత్రం అంటూ వ్యంగ్యంగా కౌంటర్స్ చేస్తున్నారు జనాలు. మనకు తెలిసిందే చాలా మందికి కొన్ని కొన్ని అలర్జీస్ ఉంటాయి . అయితే ఎక్కువగా ఎలర్జీస్ అంటే డస్ట్ లేదా ఫుడ్ కి సంబంధించి ఉంటాయి . కానీ హీరోయిన్ సమంతకి మాత్రం పూలు అంటే అస్సలు పడవట .పూలు టచ్ చేసిన పూలు వాసన చూసిన ఆమెకు స్కిన్ రాషెస్ వచ్చేస్తాయట.

ఈ క్రమంలోనే ఓసారి అలా పూలు టచ్ చేసినందుకు గాను ఎమర్జెన్సీ రూమ్ కి కూడా వెళ్లవలసి వచ్చిందట . ఇదే విషయాన్ని స్వయాన సమంతనే చెప్పుకొచ్చింది . సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే . రెగ్యులర్గా జిమ్ వీడియోలు, తన పెట్ డాగ్స్ కి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది . అయితే రీసెంట్ గా ఓ ఫ్లవర్ బొకేతో ఫోటోని షేర్ చేసిన సమంత తనకు ఫ్లవర్ బొకే ఇస్తే నాకు భయమని అలాంటివి చూసినప్పుడు మిక్స్డ్ ఫీలింగ్స్ కలుగుతాయని..

ఒకసారి వీటి వల్లే ఎమర్జెన్సీ రూమ్స్ కి వెళ్ళవలసి వచ్చింది అని .. పూలు అంటే ఎలర్జీ ఉంది అని పోస్ట్ చేసింది . దీనిపై కొందరు పాపం అంటుంటే మరికొందరు వ్యంగ్యంగా కౌంటర్స్ చేస్తున్నారు .ఆడపిల్లకి పూలు అంటే పడకపోవడం ఏంటి అంటూ వెటకారంగా కౌంటర్స్ వేస్తున్నారు. ఇక సమంత త్వరగా సినిమాల్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే సామ్ మాత్రం ఇంకా ఏ సినిమాలు ఓకే చేయలేదని సమాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news