Movies"ఒకవేళ ప్రభాస్ ఈ సినిమాని రిజెక్ట్ చేసి ఉంటే..ఖచ్చితంగా ఆ హీరో...

“ఒకవేళ ప్రభాస్ ఈ సినిమాని రిజెక్ట్ చేసి ఉంటే..ఖచ్చితంగా ఆ హీరో తోనే చేసి ఉండేవాడిని”.. సంచలన విషయాన్ని బయటపెట్టిన మారుతి..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ప్రెసెంట్ మారుతీ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా రాజా సాబ్ . ఫుల్ టు ఫుల్ ఫ్యామిలీ హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులకు భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాల్లో నటించే ప్రభాస్ ఇంత చిన్న సినిమాలో నటించడమే పెద్ద గ్రేట్ అంటుంటే.. ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేస్తాడు ప్రభాస్ అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు .

ఈ మూవీ డైరెక్టర్ మారుతీ రీసెంట్ గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాన్ని బయటపెట్టారు . నిజానికి మారుతికి బడా బడా హీరోల నుంచి కూడా ఆఫర్స్ వచ్చాయి . మెగాస్టార్ చిరంజీవికి ఒక లైన్ అప్ చెప్పాడు . బాగా ఇంప్రెస్ అయ్యాడు చిరంజీవి . అయితే చిరంజీవి .. వశిష్ట సినిమాలో నటించకుండా ఉండి ఉంటే ఆ సినిమా ఫిక్స్ అవ్వకుండా ఉండి ఉంటే మొదట మారుతి చిరంజీవి సినిమానే తెరకెక్కాల్సింది.

ఎప్పుడైతే ఆ సినిమా ఫిక్స్ అయిందో వెంటనే మారుతీ తన నెక్స్ట్ హీరో ప్రభాస్ తో రాజా సాబ్ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు . ఇదే విషయాన్ని మారుతి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు . ఒకవేళ ప్రభాస్ తో సినిమా లేట్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా చిరంజీవితోనే సినిమా చేసి ఉండే వాడిని అంటూ కాన్ఫిడెంట్గా మాట్లాడారు. ప్రజెంట్ ఆ ఇంటర్వ్యూ తాలూకా వీడియో నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news