Moviesచిరంజీవి మెగాస్టార్ అవ్వడనికి కారణం ఆ కల నా..? ఆ రాత్రి...

చిరంజీవి మెగాస్టార్ అవ్వడనికి కారణం ఆ కల నా..? ఆ రాత్రి జరిగిన అద్భుతం ఏంటో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ అనగానే అందరికీ గుర్తు వచ్చే పేరు. చిరంజీవి .. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. కష్టానికి మరో మారుపేరు . నమ్మకానికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడమే కాకుండా తన పేరు చెప్పుకొని నలుగురు ఇండస్ట్రీలోకి వచ్చే విధంగా మార్చుకున్నాడు . అయితే అందరిలా చిరంజీవి ఇటువంటి కష్టాలు పడకుండా రాత్రికి రాత్రి స్టార్ హీరో అయిపోలేదు .

ఆయన మెగాస్టార్ అవ్వడం కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా గడిపారు. అయితే చాలామందికి తెలిసిందే చిరంజీవి అసలు పేరు శివ శంకర వరప్రసాద్. ఆయన పేరు మార్చడం వెనక రీజన్ ఉంది .అద్భుతం కూడా జరిగింది . చిరంజీవికి కలలో ఒకరోజు రాముల వారి గుడికి వెళ్లినట్లు కల వచ్చిందట. అక్కడ దండం పెట్టుకుంటూ ఉంటే “రా చిరంజీవి వెళదాం” అనే మాట కూడా వినిపించిందట . దీంతో నిద్రలోనే ఉలిక్కిపడి వెనక్కి చూసిన చిరంజీవి అక్కడ ఎవ్వరూ లేరట .

ఇదే విషయాన్ని వాళ్ళ అమ్మకి చెప్పారట. దీంతో అంజనమ్మ చిరంజీవి అనే పేరును పెట్టుకోమన్నారట . స్వయాన ఆంజనేయస్వామి నీకు ఆశీస్సులు అందిస్తున్నాడు .. నీ పేరు మార్చుకో అంటూ అంజనమ్మ చిరంజీవి అంటూ ఆయనకు మరోసారి నామకరణం చేసిందట . ఆ తర్వాత చిరంజీవి లైఫ్ ఎలా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పట్టిందల్లా బంగారమే అన్నట్లు ఆయన చేసిన ప్రతి సినిమా హిట్ అయింది . ఇప్పుడు టాలీవుడ్ నే శాసించే పెద్దదిక్కుగా మెగాస్టార్ గా మారాడు . ఆరోజు ఆ కల చిరంజీవి లైఫ్ నే టర్న్ చేసింది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news