Movies"ఓరేయ్ ..ప్లీజ్ రా అర్ధం చేసుకో"..తేజ సజ్జాకు మహేశ్ బాబు స్పెషల్...

“ఓరేయ్ ..ప్లీజ్ రా అర్ధం చేసుకో”..తేజ సజ్జాకు మహేశ్ బాబు స్పెషల్ రిక్వెస్ట్..!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో తేజ సజ్జా పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తున్నాం. దానికి కారణం ఆయన నటించిన హనుమాన్ సినిమా రిలీజ్ కి సిద్ధం అవ్వడమే . సంక్రాంతి కానుకగా బాక్స్ ఆఫీస్ వద్ద టఫ్ కాంపీటీషన్ నెలకొంది . చాలామంది స్టార్ హీరోస్ నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్నాయి. జనవరి 12వ తేదీ సంక్రాంతి కానుకగా మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం” సినిమా రిలీజ్ కాబోతుంది.

అదేరోజు “హనుమాన్” సినిమా కూడా రిలీజ్ అవుతూ ఉండడం గమనార్హం . గతంలో మహేష్ బాబు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తేజ.. ఇప్పుడు ఆయనకే కాంపిటీషన్ ఇస్తూ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేస్తూ ఉండడం గమనార్హం . ఇదే క్రమంలో తేజ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నారు. : నా సినిమాలు మహేష్ బాబుకు కాంపిటీషన్ ఇస్తున్నాయి అని మాట్లాడుకోవడం చాలా హాస్యాస్పదం” అంటూ ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ..

“రాజకుమారుడు యువరాజు సినిమాలలో మహేష్ తో కలిసి నటించేటప్పుడు ఆయన పేరు పలకడం రాక మహేష్ ని మగేష్ అంటూ పిలిచే వాడినని.. అప్పుడు మహేష్ బాబు వచ్చి ఒరేయ్ నీకు పిలవడం రాకపోతే అన్నా అని పిలువు.. అంతేగాని నా పేరు ని ఇలా కూని చేయొద్దు .. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో” అంటూ రిక్వెస్ట్ చేశారట . ఆ విషయాన్ని ఇప్పటికి మర్చిపోలేక పోతున్నాను అని తేజ చెప్పుకోరావడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news