Moviesఅమ్మ బాబోయ్.. మన మహేశ్ బాబుకి ధైర్యం ఎక్కువే.. జర్మనీ అడవుల్లో...

అమ్మ బాబోయ్.. మన మహేశ్ బాబుకి ధైర్యం ఎక్కువే.. జర్మనీ అడవుల్లో ఏం చేస్తున్నారో చూడండి..!!

మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పాపులారిటి సంపాదించుకున్న మహేష్ బాబు ప్రెసెంట్ జర్మనీలో ఉన్నారు. గుంటూరు కారం సినిమా హిట్ అవ్వగానే ఆయన హుటాహుటిన జర్మనీ వెళ్లిపోయారు . అందరూ రాజమౌళి సినిమా కోసం ఆయన జర్మనీ వెళ్లారు అని అనుకున్నారు. కానీ ఆయన ఒక డాక్టర్ ని కలవడానికి జర్మనీ వెళ్లారు అంటూ ఆయన పోస్టు ద్వారా తెలిసింది.

ఆ డాక్టర్ బాడీ ఫిట్నెస్ పై సూచనలు ఇస్తూ ఉంటారు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది . కాగా రీసెంట్గా మహేష్ బాబు తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ ఇప్పుడు వైరల్ గా మారాయి . మహేష్ బాబు తన డాక్టర్ తో జర్మనీ అడవుల్లో ట్రకింగ్ చేస్తున్నారు . దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

ఇన్స్టాగ్రామ్ లో మహేష్ బాబు పోస్ట్ చేసిన ఫోటోలు చూసిన నమ్రత..:” మిస్ యు అండ్ లవ్ ” ఎమోజిస్ తో ఎమోషనల్ గా కామెంట్ చేసింది. నమ్రత చేసిన కామెంట్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. జర్మనీ అడవుల్లో మహేష్ బాబు టకింగ్ చాలా అడ్వెంచర్స్ గా ఉంది.. రాజమౌళి సినిమా కోసమే ఇదంతా అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news