Moviesదిల్ రాజు "తాటతీస్తా" వార్నింగ్ ఆ ఇద్దరికేనా...? ఇకనైనా నోరు మూయండి...

దిల్ రాజు “తాటతీస్తా” వార్నింగ్ ఆ ఇద్దరికేనా…? ఇకనైనా నోరు మూయండి రా..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో దిల్ రాజుకు సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అయ్యాయో మనం చూసాం . మరీ ముఖ్యంగా హనుమాన్ – గుంటూరు కారం సినిమాల మధ్య ఎంత ఇష్యూ నడిచిందో.. ఆ విషయంలో దిల్ రాజు ఎలా నలిగిపోయాడో..అందరికీ తెలిసిందే. హనుమాన్ సినిమాకి తక్కువ థియేటర్స్ కేటాయించారని.. గుంటూరు కారం సినిమాకి ఎక్కువ థియేటర్స్ ఇచ్చారని .. ఇండస్ట్రీలో ఇంత పక్షపాతం అస్సలు పనికిరాదని చాలామంది ఫైరయ్యారు .

అంతేకాదు అసలు దిన్నంతటికీ కారణం దిల్ రాజు అని..ఆయన పై చాలా మంది మండిపడ్డారు . ప్రధానంగా రెండు సైట్స్ దిల్ రాజు పై నెగిటివ్గా కామెంట్స్ చేశాయి. నెగటివ్గా వార్తల రాసాయి . అదే టైంలో చిరంజీవి దిల్ రాజుతో గతంలో జరిగిన ఓ ఇష్యూ గురించి బయట పెట్టాడు . చిరంజీవి పాజిటివ్ గానే చెప్పారు . కానీ పక్కన వాళ్ళకి ఎలా అర్థమైందో ఏంటో ఆ ఇష్యుని నెగిటివ్గా తీసుకెళ్లారు. చిరంజీవి మాటలను డబుల్ మీనింగ్ లో అర్ధం చేసుకుని.. చేతికి వచ్చిన పదాలతో చెత్త చెత్తగా రాసేశారు.

అవి చదివిన దిల్ రాజు బాగా హర్ట్ అయ్యారు.. ఫీలయ్యారు. అన్నిసార్లు కామ్ గా ఉన్న దిల్ రాజు..ఈసారి సైలెంట్ గా ఉండకుండా ఫుల్ ఫైర్ అయిపోయారు . తప్పుడు వార్తలు రాస్తే తాటతీస్తాను అంటూ మండిపడ్డారు. రెండు వెబ్సైట్లో సోషల్ మీడియాలో దిల్ రాజు పై చెత్త గా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . దిల్ రాజు లాంటి పెద్ద ప్రొడ్యూసర్ పై తప్పుడు వార్తలు రాసే ధైర్యం ఉన్నది రెండే రెండు సైట్లకి మాత్రమే..ఆ రెండు సైట్ లు ఒక పొలిటిషియన్ బేస్ మీద రన్ అవుతున్నాయని.. వాళ్ళకి దిల్ రాజు పరోక్షకంగా వార్నింగ్ ఇచ్చాడు అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . మరి కొంతమంది వాళ్ళ గొడవ వాళ్ళది మీకెందుకురా ..కామ్ గా ఉండండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news