Moviesసుకుమార్ నెక్స్ట్ సినిమా డీటెయిల్స్ వచ్చేశాయోచ్.. మెంటల్ ఎక్కించే మూవీ ఆ...

సుకుమార్ నెక్స్ట్ సినిమా డీటెయిల్స్ వచ్చేశాయోచ్.. మెంటల్ ఎక్కించే మూవీ ఆ మెగా బ్రదర్స్ తోనే ..!!

సుకుమార్.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రజెంట్ పుష్ప 2 సినిమా షూట్ లో బిజీ బిజీగా ఉన్నా సుకుమార్ ఆ తర్వాత ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడు అన్న న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అయితే బాలయ్యతో సినిమా చేయాలి అని అనుకున్నాడు సుకుమార్ అన్న వార్తలు వినిపించాయి.

ఇప్పుడు ఆ స్థానంలోకి మెగా హీరోస్ వచ్చినట్లు తెలుస్తుంది. ఎస్ ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం పుష్ప 2 తర్వాత అలాంటి ఓ పవర్ఫుల్ సబ్జెక్టు ఉన్న స్టోరీని రాసుకున్నారట సుకుమార్. అంతేకాదు ఇది మల్టీ స్టారర్ సినిమాగా తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారట . అయితే కథ బాగా డెప్త్ గా ఉండడంతో బ్రదర్స్ రిలేషన్షిప్ బాగా తెలియజేయడానికి రియల్ బ్రదర్స్ అయితే బాగుంటుంది అని ..

కోలీవుడ్ మెగా బ్రదర్స్ సూర్యకార్తి లతో ఈ సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నారట మన సుకుమార్. ప్రజెంట్ ఈ సినిమా గురించి చర్చలు జరుపుతున్నారట సుకుమార్ – సూర్య-కార్తి. కాగా సుకుమార్ డైరెక్షన్ చాలా ఢిఫరెంట్ గా ఉంటుంది. అందరిలా ఏదో ఒకటి తెరకెక్కించామా అని సైలెంట్ అయిపోరు.. ప్రతి సీన్ చాలా మంచిగా రాసుకుంటాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news