Moviesయండమూరి నవలలతో బ్లాక్‌బ‌స్ట‌ర్లు కొట్టిన చిరంజీవి ఎందుకు హ‌ర్ట్ అయ్యారు..!

యండమూరి నవలలతో బ్లాక్‌బ‌స్ట‌ర్లు కొట్టిన చిరంజీవి ఎందుకు హ‌ర్ట్ అయ్యారు..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలలో ఛాలెంజ్ ఎంతో పెద్ద హిట్‌. ఛాలెంజ్ మాత్ర‌మే కాదు అభిలాష, దొంగ మొగుడు, రాక్షసుడు, స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్..ఇవన్నీ కూడా యండమూరి వీరేంద్ర నాథ్ రచించిన నవలల ఆధారంగా చిరంజీవి చేసిన సినిమాలే. వీటిలో నాలుగు సినిమాలు అభిలాష, దొంగ మొగుడు, రాక్షసుడు, ఛాలెంజ్ చిరంజీవి – ఏ కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వ‌చ్చిన‌వే కావ‌డం విశేషం.

ఇక ఈ నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు చిరంజీవి కెరీర్‌లో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాయి. ఒక్క‌ స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ మాత్రమే అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమాకు దర్శకుడు యండమూరి వీరేంద్ర‌నాథ్‌ కావడమే. ఆయన దర్శకత్వం వహించిన ఈ సినిమా నిర్మాతకి భారీ నష్టాలను మిగిల్చ‌గా.. ఆ త‌ర్వాత యండ‌మూరి ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌కు శాశ్వ‌తంగా దూర‌మ‌య్యారు.

త‌న‌కు ర‌చ‌యిత‌గా ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్లు ఇచ్చిన యండ‌మూరికి చిరంజీవి ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు ఇస్తాన‌ని మాట ఇచ్చారు. ఆ మాట ప్ర‌కార‌మే యండ‌మూరి ఖ‌చ్చితంగా సూప‌ర్ హిట్ ఇస్తాడ‌న్న న‌మ్మ‌కంతో చిరు ఛాన్స్ ఇచ్చారు. కానీ, ఫలితం రివ‌ర్స్ అయ్యింది. అయినా చిరంజీవి, యండమూరిల మధ్య రిలేషన్ అలానే కంటిన్యూ అయింది. ఈ చనువుతోనే చిరంజీవి రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాలలోకి వస్తానని చెప్పినప్పుడు యండమూరి వద్దన్నారు.

సినిమాలు వేరు.. రాజ‌కీయాలు వేరు.. ఇక్క‌డ స‌క్సెస్ ఆవ‌డం క‌ష్టం అని చెప్పారు. అది చిరుకు న‌చ్చ‌లేదు. చిరంజీవి దానికి బాగా హర్ట్ అయి యండమూరిని దూరం పెట్టారట. సొంత పార్టీ పెడుతున్నప్పుడు అత్యంత సన్నిహితంగా ఉండేవారెవరైనా సపోర్ట్ చేయాలే గానీ, ఇలా వద్దని సలహా ఇవ్వడం ఏంటని చిరు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

యండమూరి చెప్పిన మాట వినకుండా రాజకీయాలలోకి ఎంటర్ అయ్యారు. కానీ, ఫైనల్ గా చిరంజీవి రాజకీయాలకి పనికిరారని యండమూరి చెప్పిన మాటే నిజ‌మైంది. ఆ త‌ర్వాత ఈ గ్యాప్ చాలా యేళ్లు కంటిన్యూ అయ్యింది. చిరు సోద‌రుడు నాగ‌బాబు కూడా యండ‌మూరిని ఎన్నోసార్లు టార్గెట్ చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news