Moviesఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తూ.. ' దేవ‌ర ' కొత్త రిలీజ్...

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తూ.. ‘ దేవ‌ర ‘ కొత్త రిలీజ్ డేట్ ఇదే…

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా త‌ర్వాత వ‌రుస‌గా పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్టులు ఒప్పుకుంటున్నారు. త్రిబుల్ ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో దేవ‌ర అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. దేవ‌ర రెండు పార్టులుగా తెర‌కెక్కుతోంది. దేవ‌ర 1 ముందుగా ఈ యేడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

అయితే ఇప్పుడు దేవ‌ర 1 వాయిదా ప‌డుతున్న‌ట్టు రెండు, మూడు రోజులుగా సోష‌ల్ మీడియాలో ఒక్క‌టే ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఈ సినిమాలో విల‌న్‌గా న‌టిస్తోన్న బాలీవుడ్ న‌టుడు సైఫ్ ఆలీఖాన్ గాయ‌ప‌డ‌డంతో సైఫ్‌తో చేయాల్సిన షెడ్యూల్స్ లేట్ అయ్యాయి. ఈ క్ర‌మంలోనే షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా ఆల‌స్యం కానున్నాయి.

ముందుగా అనుకున్న‌ట్టుగా ఏప్రిల్ 5న దేవ‌ర రిలీజ్ అయ్యే ఛాన్సులు లేవు. దేవ‌ర కొత్త రిలీజ్ డేట్ కూడా వ‌చ్చేసింది. ఇది నంద‌మూరి, ఎన్టీఆర్ అభిమానుల‌కు కాస్త డిజప్పాయింటింగ్ న్యూస్ అయినా కూడా వెయిటింగ్ త‌ప్ప‌ట్లేదు. దేవ‌ర‌ను ఈ యేడాది ఆగ‌స్టు 15న థియేట‌ర్ల‌లోకి తీసుకు రానున్నారు. స్వాతంత్య్ర దినోత్స‌వం కానుక‌గా ఆగ‌స్టు 15న దేవ‌ర 1 రిలీజ్ అయితే సెల‌వు రోజుతో లాంగ్ వీకెండ్ క‌లిసి వ‌స్తుంద‌న్న‌దే మేక‌ర్స్ ప్లాన్‌.

యువ‌సుధా ఆర్ట్స్ – నంద‌మూరి ఆర్ట్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తుండ‌గా… జాన్వీక‌పూర్ ఈ సినిమాతోనే సౌత్ సినీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news