Moviesజబర్దస్త్ కి గూబ గుయ్యమనే షాక్ ఇచ్చిన అనసూయ.. అవమానించినందుకు అలా...

జబర్దస్త్ కి గూబ గుయ్యమనే షాక్ ఇచ్చిన అనసూయ.. అవమానించినందుకు అలా పగ తీర్చుకున్నేసిందిగా..!

బుల్లితెరపై బాగా పాపులారిటీ దక్కించుకున్న షోస్ ఏంటి అంటే అందరూ ముందుగా చెప్పేది మాత్రం జబర్దస్త్ అనే చెప్పాలి. అప్పటివరకు డాన్స్ , పాటలు అంటూ స్టేజ్ పెర్ఫార్మెన్సులు ప్రోగ్రామ్స్ చూసి విసిగిపోయిన జనాలకు బాగా స్ట్రెస్ గా ఫీల్ అయ్యి ఆఫీసు నుంచి ఇంటికి రాగానే నవ్వుకోడానికి ఒక గేమ్ షో వచ్చింది. అదే జబర్దస్త్ . ఈటీవీలో మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ఈ షోని బాగా డిజైన్ చేసింది . స్టార్టింగ్ లో ఈ షో బాగా మంచి ఊపు మీద ఉండింది. రికార్డ్ బ్రేకింగ్ టీఆర్ప్స్ తో దుమ్ము దులిపేసింది.

పెద్ద పెద్ద స్టార్స్ కూడా సినిమా ప్రమోషన్స్ కోసం ఈ షో కి వచ్చేవారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు . సీన్ కట్ చేస్తే ఇప్పుడు జబర్దస్త్ చూడు చూడు అన్న చూసే వాళ్ళు లేరు. అంతలా టీస్స్ర్పీస్ డౌన్ అయిపోయాయి . దానికి కారణం జబర్దస్త్ నుండి టాలెంటెడ్ యాంకర్ అనసూయ తప్పుకోవడమే . జబర్దస్త్ పెట్టినప్పటి నుంచి యాంకర్ అనసూయ చాలా కష్టపడింది. తన పర్ఫామెన్స్ తో తన అందంతో తన వాక్చాతుర్యంతో జబర్దస్త్ షోకి మంచి టిఆర్పి రేటింగ్స్ తీసుకొచ్చేలా చేసింది .

అయితే బాడీ షేమింగ్ కామెంట్స్ కారణంగా అనసూయ ఈ షో నుంచి తప్పుకుంది. ఆ విషయాన్ని ఆమె ఓపెన్ గా చెప్పుకు వచ్చింది . ఆ తర్వాత ఆమె ప్లేస్ ని రీప్లేస్ చేయడానికి కన్నడ యాంకర్ సౌమ్యా రావు – యూట్యూబర్ సిరి హనుమంత్ ఎంత ట్రై చేసినా సరే ఆ స్థానాన్ని రీచ్ కాలేకపోతున్నారు . ఈ క్రమంలోనే అనసూయ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సరికొత్త న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు . జబర్దస్త్ కి బాగా గుణపాఠం నేర్పింది అనసూయ అని .. ఆమెను అవమానించినందుకు ఇలా టిఆర్పి రేటింగ్స్ పడిపోయేలా పగ తీర్చుకుంది అని ..అనసూయనే జబర్దస్త్ కి ఇంపార్టెంట్ అని ఇప్పటికైనా మల్లెమాల వాళ్లు అర్థం చేసుకుంటే బెటర్ అని కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news