Newsనైట్ రూమ్‌లోకి రా ఎంజాయ్ చేద్దాం... ష‌కీలాకు టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్...

నైట్ రూమ్‌లోకి రా ఎంజాయ్ చేద్దాం… ష‌కీలాకు టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ వేధింపులు…!

ష‌కీల‌.. బోల్డ్ ఆర్టిస్టుగా.. పోర్న్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న విష‌యం తెలిసిందే. ఇక‌, దివంగ‌త ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ కూడా టాప్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు. అనేక మంది హీరోయిన్ల‌ను ఆయ‌న తెర‌కు ప‌రిచ‌యం చేశారు. అనేక హిట్లు కొట్టారు. కుటుంబ క‌థా సినిమాల‌కు, హాస్య భ‌రిత సినిమాల‌కు ఈవీవీ పేరు మార్మోగింది. అయితే.. ఆయ‌న పై ఇటీవ‌ల ఒక రూమ‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ష‌కీల‌తో సినిమా చేసిన స‌మ‌యంలో త‌న రూమ్‌కు ఆమెను ర‌మ్మ‌ని ఒత్తిడి చేశార‌నేది ఈ రూమ‌ర్‌.

టాలీవుడ్‌ హీరో అల్లరి నరేశ్‌ తండ్రి ఈవీవీ తనను రూమ్‌కు ర‌మ్మ‌న్నార‌ని ష‌కీల వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల తమిళ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో పని చేస్తున్నాను. గతంలో నేను కూడా ఇక్కడ ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఒకానొక సమయంలో అల్లరి నరేశ్‌ తండ్రి, ఈవీవీ సత్యనారాయణ నన్ను రూమ్ ర‌మ్మ‌న్నాడు. ఈ నైట్ ఇద్ద‌రం క‌లిసి ఎంజాయ్ చేద్దామ‌ని అన్నాడు అని ఆమె సంచ‌న‌ల వ్యాఖ్య‌లు చేసింది.

టాలీవుడ్‌ సినిమాలు వదిలేయ‌డానికి కార‌ణం ఈవీవీనేన‌ని ష‌కీల ఆరోపించింది. ఆయన ప్రవర్తన వల్ల ఇండస్ట్రీని వదిలేశానని, 20 ఏళ్లుగా స్క్రీన్‌పై కనిపించనేలేదని చెప్పింది. తాజాగా బిగ్ బాస్ షోలో కూడా రెండు వారాలు ఉన్న ష‌కీల‌.. త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చేసిన విష‌యం తెలిసిందే. అనేక సినిమాల్లో న‌టించిన ష‌కీల‌కు.. కేర‌ళ‌లో కొంద‌రు అభిమానులు గుడికూడా నిర్మించారు. అయితే.. ఆమె త‌న అనుభ‌వాల్లో టాప్ ద‌ర్శ‌కుడిపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంగ‌మ‌నార్హం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news