Newsఆ స్టార్ హీరోయిన్‌కు సినిమాలు ఆపేయ‌మ‌ని వార్నింగ్ ఇచ్చిన సీనియ‌ర్ ఎన్టీఆర్‌......

ఆ స్టార్ హీరోయిన్‌కు సినిమాలు ఆపేయ‌మ‌ని వార్నింగ్ ఇచ్చిన సీనియ‌ర్ ఎన్టీఆర్‌… అస‌లేం జ‌రిగింది..!

తెలుగు సినీ రంగంలో దివంగత నట సౌర్వ‌భౌమ నటరత్న ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్టీఆర్ ఈ లోకాన్ని విడిచి వెళ్లి రెండున్నర దశాబ్దాలు దాటుతున్నా కూడా ఇంకా ఎన్టీఆర్‌ను అభిమానించే ఈ తరం అభిమానులు కూడా లక్షల్లో ఉన్నారు. ఎన్టీఆర్ కేవలం సినీ నటుడుగానే కాకుండా అటు రాజకీయాల్లోనూ.. తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు. అప్పట్లో ఎన్టీఆర్ ఎంతోమంది కొత్త హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఎన్టీఆర్ తో నటిస్తే చాలు మా జన్మ ధన్యం అయిపోతుంది అనుకునే హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు.

ఎన్టీఆర్ కి జోడిగా ఎన్నో సినిమాలలో నటించి సహజ‌న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మన తెలుగు అమ్మాయి జయసుధ తెలుగు ఇండస్ట్రీలో జయసుధ ఆ తరం స్టార్ హీరోలు అందరితోనూ నటించారు. ఇప్పటికీ ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. జయసుధ కేవలం 19 ఏళ్ళ వయసులోనే ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించింది. జయసుధ ఎవరో కాదు దివంగత మహిళా ద‌ర్శ‌కురాలు.. సూపర్ స్టార్ కృష్ణ భార్య అయిన.. విజయనిర్మలకు స్వయానా మేనకోడలు కావడం విశేషం.

ఇదిలా ఉంటే సినిమాల్లో మానేయాలని జయసుధకు సీనియర్ ఎన్టీఆర్ స్వయంగా వార్నింగ్ ఇచ్చారట. వినటానికి విచిత్రంగా ఉన్న ఇది నిజం. ఒకానొక టైంలో జయసుధ సినిమాలు మానేయాలి అని అనుకున్నారట. ఆ తర్వాత ఆమెకు వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు రావడంతో.. నటన కంటిన్యూ చేస్తున్నారు. ఆమె పెళ్లి చేసుకున్న కూడా పెళ్లి తర్వాత ఎక్కువ అవకాశాలు రావడం.. ఆమె నటించిన సినిమాలు అన్ని సూపర్ హిట్లు అవుతుండడంతో.. జయసుధ నటన ఆపలేదు.

అయితే ఆమె ఏ హీరోతో నటించినా ఇక సినిమాలు చేయటం ఆపేస్తాను అని చెబుతూనే సినిమాలలో నటించడం కంటిన్యూ చేస్తుందట. ఒకరోజు సీనియ‌ర్‌ ఎన్టీఆర్ అమ్మ నువ్వు సినిమాలు చేయటం మానేసేయ్.. లేదంటే ఇకపై నేను సినిమాలు ఆపేస్తాను అని తేల్చేశార‌ట‌. నీకు పెళ్లి అయింది హ్యాపీగా సంసార జీవితాన్ని ఎంజాయ్ చెయ్ అని చెప్పారట. ఈ విషయాన్ని జయసుధ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఎన్టీఆర్, జయసుధ కాంబినేషన్లో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news