Moviesమాస్ + యాక్ష‌న్‌తో ఊచ‌కోత కోసిప‌డేసిన ' స‌లార్ ' ట్రైల‌ర్...

మాస్ + యాక్ష‌న్‌తో ఊచ‌కోత కోసిప‌డేసిన ‘ స‌లార్ ‘ ట్రైల‌ర్ 2 ( వీడియో )

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 22 న థియేటర్ల లో రిలీజ్ కానుంది. ఇప్ప‌టికే ఈ సినిమా ప్రచార చిత్రాలు రిలీజై ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఫ‌స్ట్ ట్రైల‌ర్ అయితే యూట్యూబ్‌లో వీరంగం ఆడేసింది. తెలుగు వెర్ష‌న్ ట్రైల‌ర్‌కు ఏకంగా 44 మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి.

మిగిలిన అన్ని భాష‌ల్లో ట్రైల‌ర్ వ్యూస్ క‌లిపితే అస‌లు స‌లార్ ట్రైల‌ర్‌తో సినిమాపై హైప్ ఎక్క‌డికో వెళ్లిపోయింది. ఇక స‌లార్ నుంచి రెండో ట్రైల‌ర్ ఫైనల్ పంచ్ పేరిట నేడు ఉదయం 10:42 గంటలకు రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే ఇది కాస్త ఆల‌స్యంగా ఇప్పుడు రిలీజ్ చేశారు. ఈ ఫైన‌ల్ పంచ్ ట్రైల‌ర్ కూడా అదిరిపోయింది. అలా రిలీజ్ అయిన 15 నిమిషాల్లోనే ఏకంగా 8 ల‌క్ష‌ల వ్యూస్‌తో దూసుకు పోతోంది.

ఫైన‌ల్ ట్రైల‌ర్ లో అదిరిపోయే విజువ‌ల్స్, మాస్ యాక్షన్ సన్నివేశాలు, ఫైట్స్, గ్రాండియర్ విజువల్స్, ప్రభాస్ లుక్స్, స్టైల్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్ని అదిరిపోయాయి. మొత్తంగా మ్యాసివ్ యాక్షన్ తో అదరగొట్టిన ఈ ట్రైలర్ దెబ్బ‌తో స‌లార్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఊచ‌కోత కోయ‌బోతోంద‌ని క్లారిటీ వ‌చ్చేసింది. ఇక మ‌రో నాలుగు రోజుల్లో స‌లార్ బాక్సాఫీస్‌ను షేక్ చేయ‌డం ఒక్క‌టే మిగిలి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news